ఏపీ మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్ కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంపు కార్యాలయం, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుర్తించారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:00 am, Sun, 25 August 19
ఏపీ మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్ కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెలపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అసెంబ్లీ అధికారులు కోడెల క్యాంపు కార్యాలయం, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుర్తించారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కోడెల శివ ప్రసాద్‌పై ఐపీసీ 409 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.