యూఎస్ టూర్ సక్సెస్.. తాడేపల్లి చేరుకున్న ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇవాళ ఉదయం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు అక్కడి […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇవాళ ఉదయం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారి నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా వాషింగ్టన్ డీసీలో ఇచ్చిన విందులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.