AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్‌ బరోడా వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో..

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం
Bank Of Baroda Jobs
Srilakshmi C
|

Updated on: Mar 27, 2026 | 7:59 AM

Share

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 27వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • ఏవీపీ II గ్రూప్ హెడ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 4
  • ఏవీపీ II టెరిటరీ హెడ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 17
  • డిప్యూటీ మేనేజర్ – సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ విభాగంలో పోస్టుల సంఖ్య: 70
  • డిప్యూటీ మేనేజర్ – వెల్త్ స్ట్రాటజిస్ట్ విభాగంలో పోస్టుల సంఖ్య: 13

బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

డిప్యూటీ మేనేజర్/ఏవీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం ఉండాలి. ఇక అభ్యర్ధుల వయసు మార్చి 1, 2026 నాటికి.. ఏవీపీ II గ్రూప్ హెడ్ పోస్టులకు వయసు 31 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏవీపీ II – టెరిటరీ హెడ్ పోస్టులకు వయసు 27 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్ – సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు వయసు 24 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్ – వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులకు వయసు 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 16, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, సైకోమెట్రికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us