AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో 47 ఉద్యోగాలు.. నెలకు రూ.1.47 లక్షల వరకు జీతం!

ఏపీపీఎస్సీ (APPSC) మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. టెక్నికల్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో 18 నుంచి 44 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం కాగా, నవంబర్‌ 26 చివరి తేదీగా నిర్ణయించారు. ఉద్యోగాల వారీగా అర్హతలు, జీతభత్యాలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి..

APPSC మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో 47 ఉద్యోగాలు.. నెలకు రూ.1.47 లక్షల వరకు జీతం!
APPSC Mines and Geology Department Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 08, 2026 | 9:44 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీ మైన్స్‌ అండ్‌ జియాలజీ సర్వీస్‌, సబ్‌ సర్వీస్‌ పరిధిలో మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 36 పోస్టులు
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (మైన్స్‌): 01 పోస్టు
  • రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌: 09 పోస్టులు
  • మొత్తం ఖాళీలు: 47 పోస్టులు

పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఒక్కో పోస్టుకు అవసరమైన ప్రత్యేక విద్యార్హతలు, సబ్జెక్టులు, ఇతర అర్హతలను అభ్యర్థులు సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. 01-07-2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను పరిశీలించాలి. అనంతరం సూచించిన విధంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థుల ఎంపికను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (CBRT) ద్వారా నిర్వహిస్తారు. సింగిల్‌ లెవెల్‌ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధానం ఉంటుంది. అవసరమైన ఇతర ప్రక్రియల్లో భాగంగా కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితర పరీక్షలు కూడా నిర్వహించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (మైన్స్‌): నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760, ఇతర పోస్టులకు నెలకు రూ.35,570 నుంచి రూ.1,09,910 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబర్ 6, 2026 నుంచి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 26, 2026.

ఏపీలో మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 47 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు సంబంధించిన సిలబస్‌, విధానం, పోస్టుల వారీగా అర్హతల వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us