AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం చిత్రం.. కుటుంబ సభ్యులు కూడా ఓటేయలేదా..? MPTC అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీసం తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఓట్లయినా పొందుతుంటారు. కానీ ఈ అభ్యర్థికి మాత్రం ఒక్క ఓటే రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం చిత్రం.. కుటుంబ సభ్యులు కూడా ఓటేయలేదా..? MPTC అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు!
Mptc Results
Balaraju Goud
|

Updated on: Nov 08, 2026 | 8:58 AM

Share

కడప: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీసం తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఓట్లయినా పొందుతుంటారు. కానీ ఈ అభ్యర్థికి మాత్రం ఒక్క ఓటే రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన చడా సువర్ణకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పోలైంది. అదే స్థానంలో టీడీపీ అభ్యర్థి స్రవంతి 1,508 ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బమ్మకు 1,037 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 27 ఓట్లు పోలయ్యాయి.

టీడీపీ అభ్యర్థి స్రవంతి తన ప్రత్యర్థిపై 471 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం స్వతంత్ర అభ్యర్థి సువర్ణకు వచ్చిన ఒక్క ఓటే. అసలు ఆమెకు కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదా? లేక మద్దతుదారులు సైతం దూరంగా ఉన్నారా? అంటూ గ్రామస్థులు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.

మొత్తానికి ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాలు, ఓటములతో పాటు ఇలాంటి అరుదైన ఘటనలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకూ విలువ ఉంటుందని చెప్పే వేళ.. ఒక అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే రావడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక చర్చగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇక వాట్సప్‌కే వచ్చేస్తుంది
ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇక వాట్సప్‌కే వచ్చేస్తుంది
ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధానిగా మాజీ సైన్యాధ్యక్షుడు..?
ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధానిగా మాజీ సైన్యాధ్యక్షుడు..?
ఎన్నికల్లో వింత రికార్డు.. అభ్యర్థికి వచ్చింది ఒక్కటే ఓటు!
ఎన్నికల్లో వింత రికార్డు.. అభ్యర్థికి వచ్చింది ఒక్కటే ఓటు!
ఏపీ, తెలంగాణకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో..
ఏపీ, తెలంగాణకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో..
ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. ఇంట్లోనే అసలైన ఎంటర్టైన్మెంట్..
ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. ఇంట్లోనే అసలైన ఎంటర్టైన్మెంట్..
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!