AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. SSC పరీక్ష ఫీజుల చెల్లింపులు ప్రారంభం!

పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబరు 11 నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు నవంబరు 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుములతో డిసెంబరు 15 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ సబ్జెక్టుల సంఖ్య, కేటగిరీని బట్టి నిర్ణీత పరీక్ష ఫీజుతో పాటు అవసరమైన అదనపు రుసుములు చెల్లించాలి..

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. SSC పరీక్ష ఫీజుల చెల్లింపులు ప్రారంభం!
AP SSC Exam Fee Payment
Srilakshmi C
|

Updated on: Nov 16, 2026 | 8:13 AM

Share

అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. 2027 మార్చిలో జరిగే పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబరు 11 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు నవంబరు 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నిర్ణీత గడువులో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో మరో అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు తేదీలు, ఆలస్య రుసుము వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు గడువులు

  • నవంబరు 11 నుంచి 25 వరకు: ఎలాంటి అపరాధ రుసుము లేదు.
  • నవంబరు 26 నుంచి డిసెంబరు 2 వరకు: రూ.50 ఆలస్య రుసుము.
  • డిసెంబరు 3 నుంచి 9 వరకు: రూ.200 ఆలస్య రుసుము.
  • డిసెంబరు 10 నుంచి 15 వరకు: రూ.500 ఆలస్య రుసుము.

ఈ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు.

విద్యార్థులు చెల్లించాల్సిన పరీక్ష ఫీజు వివరాలు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నారనే దానిపై ఫీజు ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే రెగ్యులర్‌ విద్యార్థులు: రూ.125
  • మూడు సబ్జెక్టుల వరకు రాసే రెగ్యులర్‌ విద్యార్థులు: రూ.110
  • వృత్తివిద్య (Vocational) అభ్యర్థులు: సాధారణ ఫీజుకు అదనంగా రూ.60
  • నిర్ణీత వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే విద్యార్థులు: రూ.300 వయోపరిమితి సడలింపు రుసుము.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారు. ఆలస్య రుసుములు చెల్లించకుండా ఉండాలంటే నవంబరు 25లోపు ఫీజు చెల్లించడం మంచిది. విద్యార్థులు తమ పాఠశాల ద్వారా సంబంధిత వివరాలను తెలుసుకుని గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

Follow Us