ఆ కేసులో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు: డీజీపీ గౌతమ్ సవాంగ్‌

దళిత యువకుడు వరప్రసాద్‌ శిరోముండనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును వేగం చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌, జిల్లా ఎస్పీని ఆదేశించారు.

ఆ కేసులో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు: డీజీపీ గౌతమ్ సవాంగ్‌
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 1:59 PM

దళిత యువకుడు వరప్రసాద్‌ శిరోముండనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును వేగం చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌, జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ కేసుపై మాట్లాడిన గౌతమ్ సవాంగ్‌.. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, తప్పుడు సమాచారాన్ని ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సవాంగ్‌ హెచ్చరించారు.

కాగా ఇసుక లారీలు అడ్డుకున్నందుకు స్థానిక వైసీపీ నాయకుడు, వరప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 18న వరప్రసాద్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని తీవ్రంగా కొట్టి, శిరోముండనం కూడా చేశారు. ఈ విషయం కాస్త సీఎం జగన్ దగ్గరకు వెళ్లగా.. ఆయన సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌.. ఇప్పటికే ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు వేశారు.

Latest Articles