ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. 3500 స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ..!

ఏపీలోని 3500 ప్రాధమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించడంతో పాటు.. ఉపాధ్యాయుల నియామకాలపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

  • Ravi Kiran
  • Publish Date - 2:22 pm, Fri, 24 July 20
ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. 3500 స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ..!

LKG, UKG Education: ఏపీ విద్యావిధానంలో సమూల మార్పులు చేసేందుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 3500 ప్రాధమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించడంతో పాటు.. ఉపాధ్యాయుల నియామకాలపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాగా, ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలను ఈ బడులలోకి తీసుకుని.. వారిని ఒకటో తరగతికి కావాల్సిన విధంగా తీర్చిదిద్దనున్నారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!