AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాఖీ పండుగ కోసం వచ్చి కానరాని లోకాలకు.. అందరూ చూస్తుండగానే.. కమ్మేసిన రాకాసి అల..!

రాఖీ పండుగ కోసం విశాఖ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ యువకుడు అవిరల్ సింగ్, యారాడ బీచ్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతుండగా అలల బారిన పడి గల్లంతయ్యాడు. పోలీసులు, కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన విశాఖలో తీవ్ర సంచలనం రేపింది.

రాఖీ పండుగ కోసం వచ్చి కానరాని లోకాలకు.. అందరూ చూస్తుండగానే.. కమ్మేసిన రాకాసి అల..!
Man Drowns At Yarada Beach
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 31, 2026 | 12:02 PM

Share

కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి యారాడ తీరానికి వెళ్లిన యువకుడు.. కెరటాల్లో చిక్కుకుని గల్లంతయ్యాడు. రోజంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవిరల్‌ సింగ్‌.. తన తల్లితో కలిసి రాఖీ పండగ కోసం విశాఖ వచ్చాడు. మల్కాపురం సమీపంలోని నౌసేనాబాగ్‌లో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన తరువాత ఆదివారం (ఆగస్టు 30) కావడంతో బంధువులు ఎనిమిది మంది కలిసి యారాడ బీచ్‌కు విహారానికి వెళ్లారు. తీరంలో అంతా కలిసి.. ఆనందంగా గడిపిన అనంతరం ఒక్కొక్కరుగా సముద్ర స్నానాలకు దిగారు. అవిరల్‌ సింగ్‌ కాస్త ముందుకు వెళ్లి సాన్నం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది.

కళ్ళముందే.. సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని చూసి బంధువులంతా పెద్దగా కేకలు వేశారు. స్పందించిన సమీపంలోని గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేదు. స్థానికులు న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తీరానికి చేరుకుని కోస్ట్‌గార్డు, నేవీ సహకారంతో తొలి రోజాంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆవిరల్ సింగ్‌ ఆచూకీ తొలిరోజు లభ్యం కాలేదు. సోమవారం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. అవిరల్ సింగ్ కోసం తీరంలో ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కుటుంబం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కన్నీళ్లు పెట్టిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ వాట్సాప్‌ మెసేజ్‌..!
కన్నీళ్లు పెట్టిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ వాట్సాప్‌ మెసేజ్‌..!
అయ్యో పాపం.. మరోసారి 90ల్లోనే తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ..!
అయ్యో పాపం.. మరోసారి 90ల్లోనే తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ..!
రోజూ రెండు గుప్పెళ్ళు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ
రోజూ రెండు గుప్పెళ్ళు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ
ఆంధ్ర ‘అరుణాచలం’గా పేరుగాంచిన కుందుర్పమ్మ కొండ.. పౌర్ణమిలో...
ఆంధ్ర ‘అరుణాచలం’గా పేరుగాంచిన కుందుర్పమ్మ కొండ.. పౌర్ణమిలో...
25 ఏళ్లైన తగ్గని వాయిస్ పవర్.. సింగర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
25 ఏళ్లైన తగ్గని వాయిస్ పవర్.. సింగర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
యారాడ బీచ్ అలలపాలై యువకుడు గల్లంతు!
యారాడ బీచ్ అలలపాలై యువకుడు గల్లంతు!
పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు దీన్ని మించి సూపర్‌ఫుడ్ లేదు..
పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు దీన్ని మించి సూపర్‌ఫుడ్ లేదు..
ముంబై వీధుల్లో పెన్నులు అమ్మాడు.. ఆపై బాలీవుడ్‌లో అగ్రనటుడిగా..
ముంబై వీధుల్లో పెన్నులు అమ్మాడు.. ఆపై బాలీవుడ్‌లో అగ్రనటుడిగా..
బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది? అసలు నిజాలు
బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది? అసలు నిజాలు
51 బంతుల్లో కాటేరమ్మ కొడుకు దూల తీర్చిన నయా సెన్సేషన్..!
51 బంతుల్లో కాటేరమ్మ కొడుకు దూల తీర్చిన నయా సెన్సేషన్..!