AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ముగ్గురు.. ఆపి వారి లగేజ్ చెక్ చేయగా.. లచ్చిందేవి..

విశాఖ రైల్వే స్టేషన్‌లో రైళ్లు వస్తూపోతూ, ప్లాట్‌ఫామ్స్ అన్ని ప్రయాణికులతో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను పోలీస్‌లు గుర్తించారు. వారిని విచారించగా తడబడ్డారు. బ్యాగులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు బయటపడింది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ..

Vizag: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ముగ్గురు.. ఆపి వారి లగేజ్ చెక్ చేయగా.. లచ్చిందేవి..
Vizag Railway Station
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 27, 2025 | 10:00 PM

Share

అది విశాఖ రైల్వే స్టేషన్.. రైళ్లు వస్తూపోతూ ఉన్నాయి.. ప్లాట్ ఫామ్స్ అన్నీ బిజీబిజీగా ప్రయాణికులతో కనిపిస్తున్నాయి.. ఇంతలో ఒకటే అలజడి.. ఓ ముగ్గురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు.. పిలిచి ప్రశ్నిస్తే తడబడ్డారు.. వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే.. నోట్ల కట్టలు కనిపించాయ్.

సాధారణ తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీస్- జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ – ఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అన్ని ప్లాట్ ఫామ్‌లపై నిఘా పెంచి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. వారి లగేజీలు చెక్ చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులతో ప్లాట్‌ఫామ్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. రైళ్లు వస్తూపోతూ హడావిడిగా ఉంది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు.. విశాఖ మీదుగా ఒడిశా కంఠాబంజికు వెళ్తున్నారు. ఏదో అనుమానస్పదంగా ఉన్నారు. పిలిచి వాళ్ల ముగ్గురుని విచారిస్తే తడబడ్డారు. బ్యాగుల్లో ఏమున్నాయి అని ప్రశ్నిస్తే బిత్తర చూపులు చూశారు. దీంతో  తనిఖీలు చేశారు రైల్వే పోలీసులు. నోట్ల కట్టలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అన్ని 500 రూపాయల నోట్లే.. కొన్ని మాత్రం 200 రూపాయల కట్టలు. అన్ని కలిపి లెక్కిస్తే 43 లక్షలు…! వాళ్ళను ప్రశ్నిస్తే.. తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళుగా తేలింది. నగదును తెలంగాణలో తమ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీల కోసమని చెప్పుకొచ్చారు. వారికి అడ్వాన్స్ ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు వివరణ ఇచ్చారు. లెక్కా పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. వారితోపాటు, స్వాధీనం చేసుకున్న నగదును మహారాణిపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచినట్లు పోలీసులు తెలిపారు.

Cash Seized

Cash Seized

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ