Visakha: పోయిన 200 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యజమానులకు అప్పగింత

|

Mar 18, 2023 | 9:03 AM

మిస్సయిన ఫోన్లను వినియోగిస్తున్న వారిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాళ్ళతో మాట్లాడి 200 మొబైల్ ఫోన్లను పట్టుకొచ్చారు పోలీసులు. మీడియా సమక్షంలో మొబైల్ ఫోన్లో పోగొట్టుకున్న బాధితులకు. అప్పగించారు.

Visakha: పోయిన 200 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..  యజమానులకు అప్పగింత
Missing Mobiles In Visakha
Follow us on

కొన్ని నెలల క్రితం వరకు సెల్ ఫోన్లు దొంగతనం చేసారంటే.. ఇక అవి ఎంత ఖరీదైనవి అయినా.. విలువైన సమాచారం ఉన్నా వాటిమీద ఆశలు వదిలేసుకోవాల్సిందే నని భావించేవారు. అయితే ఇప్పుడు దొంగతనం చేసిన ఫోన్లను పోలీసులు పట్టుకుంటున్నారు. ఆయా ఫోన్ల యజమానులకు జాగ్రత్తగా తిరిగి అప్పగిస్తున్నారు. తాజాగా ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖలో పోలీసులు భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేశారు.

విశాఖలో మిస్సయిన మొబైల్ ఫోన్లు ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణ తో పాటు ఏపీలోని వివిధ జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించి రికవరీ చేశారు. మిస్సయిన ఫోన్లను వినియోగిస్తున్న వారిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాళ్ళతో మాట్లాడి 200 మొబైల్ ఫోన్లను పట్టుకొచ్చారు పోలీసులు. మీడియా సమక్షంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. సిసిఎస్ పోలీసులను డిసిపి అభినందించారు.

విశాఖలో మిస్సయిన మొబైల్ ఫోన్లు ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణ తో పాటు ఏపీలోని వివిధ జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించి రికవరీ చేశారు. మిస్సయిన ఫోన్లను వినియోగిస్తున్న వారిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాళ్ళతో మాట్లాడి 200 మొబైల్ ఫోన్లను పట్టుకొచ్చారు పోలీసులు. మీడియా సమక్షంలో మొబైల్ ఫోన్లో పోగొట్టుకున్న బాధితులకు. అప్పగించారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు గుర్తింపు పత్రాలు లేని మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన అమ్మకాలు జరిపిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అటువంటి సమాచారం ఉంటే తెలియజేయాలని క్రైమ్ డిసిపి నాగన్న సూచించారు. దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మొబైల్ ఫోన్లో ట్రాక్ చేసి తీసుకొచ్చిన సీసీఎస్ పోలీసులను డీసీపీ అభినందించారు. మరోవైపు ఇక మిస్సయిన మొబైల్ ఫోన్లో వస్తాయో రావో అన్న సందేహంలో ఉన్న వినియోగదారులకు పోలీసులు రికవరీ చేసిన మొబైల్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు  కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..