AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ‘తాతా ఆ బొమ్మ కావాలి’ అని చిన్నారి అడిగింది.. కాలువలో తొంగి చూస్తే గుండె పట్టుకొనే పనైంది..!

విశాఖపట్నంలో అమానుషం. కంచరపాలెం సంజీవయ్య కాలనీ వద్ద కాలువలో ముక్కలుగా చేసిన అప్పుడే పుట్టిన శిశువు శరీర భాగాలు కనిపించడంతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. చేతులు, కాళ్లు, శరీర భాగాలు లభించగా తల భాగం మాత్రం కనిపించలేదు. .. ..

Vizag: 'తాతా ఆ బొమ్మ కావాలి' అని చిన్నారి అడిగింది.. కాలువలో తొంగి చూస్తే గుండె పట్టుకొనే పనైంది..!
Infant Body Parts Found
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 2:12 PM

Share

విశాఖలో అమానుషం.. అప్పుడే పుట్టిన శిశువును ముక్కలుగా చేసి కాలువలో పడేశారు దుండగులు. కంచరపాలెం సంజీవయ్య కాలనీలో వెలుగులోకి వచ్చిన దారుణ జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొండవాలు ప్రాంతంలోని కాలువలో శిశువు శరీర బాగాలు కనిపించాయి. కాళ్ళు, చేతులు, శరీర భాగాలు ముక్కలుగా లభించాయి. కానీ తల భాగం కనిపించలేదు. గుర్తించలేని విధంగా శరీర బాగాలున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే పుట్టిన శిశువు గా గుర్తించారు.

ఈ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కొండవాలు నుంచి మెట్లు దిగుతూ తాతతో కలిసి ఓ చిన్నారి వస్తోంది. కాలువలో శిశువును చూసిన ఓ చిన్నారి బొమ్మ అనుకుంది. కాలువలో చూసి ‘తాత బొమ్మ కావాలి’ అని అడిగింది చిన్నారి. బురదలో ఉన్న బొమ్మ ఎందుకమ్మా అని చెప్పాడు తాత సింహాచలం. కాలువలో తొంగి చూసేసరికి శిశువు శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించాడు పెద్దాయన సింహాచలం. స్థానికులను అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు.

అర్ధరాత్రి కుక్కలు అరిచాయి..

గతంలో ఎప్పుడూ చూడని ఘటన చూసిన సంజీవయ్య కాలనీ వాసులు.. శిశువు కాలువలో శరీర భాగాలు చూసి తీవ్ర ఆందోళన చెందారు. అర్ధరాత్రి కుక్కలు అరిచాయని.. ఆ సమయంలోనే ఎవరో పడేసి ఉంటారని అంటుంది స్థానికంగా ఉన్న ఓ మహిళ. శిశువు వద్దనుకుంటే ఎవరికైనా దత్తత గానీ, అనాధ ఆశ్రమంగాని ఇస్తే బాగుండేదని.. ఇలా అమానుషంగా ఇలా చేయాలన్న ఆలోచన దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం..

రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం.. శిశువు శరీర భాగాలు లభించిన చోట క్లూస్ సేకరించారు. శరీర భాగాలను సేకరించి పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు కంచరపాలెం సిఐ రవికుమార్. స్థానికంగా ఉన్న గర్భిణీల వివరాలు ఆరా తీయాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. స్థానికుల పనా..? బయట నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ పడేసి వెళ్లిపోయారా అనేదానిపై తేలాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నిర్వహించి.. అనుమానితులతో శిశువు డిఎన్ఏ ఆధారంగా ఆ శిశువు ఎవరిది అనేది తెలుస్తుందన్నారు సిఐ రవికుమార్.

గర్భిణీలు, బాలింతల వివరాల ఆరా..

సంజీవయ్య కాలనీలో గర్భిణీల వివరాలను ఆరా తీస్తున్నారు ఆశా కార్యకర్తలు. స్థానికంగా నలుగురు గర్భిణీలు.. మరో ఇద్దరు బాలింతలున్నట్టు గుర్తించ్చారు. అందరిని సంప్రదించి ఆరా తీసారు . బయట నుంచి వచ్చిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్న ఆశా కార్యకర్తలు.

శిశువును శరీర భాగాలు వేరు చేసి పడేసిన ఘటనపై ఇప్పుడు వేర్వేరు రకాల అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు.