Vishaka: మనవరాలిపై 60 ఏళ్ల వృద్ధుడు పాశవికం.. సంచలన తీర్పు ఇచ్చిన పోక్సో కోర్ట్‌

| Edited By: Narender Vaitla

May 28, 2024 | 6:29 PM

పోక్సో కేసులో విశాఖ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మనవరాలు పై అత్యాచారం చేసిన పాపానికి ఆరుపదుల తాత కు ఇరవైయ్యేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు అయిదు లక్షల జరిమానా విధించింది స్పెషల్ పోక్సో కోర్ట్. వివరాల్లోకి వెళితే.. విశాఖ మల్కాపురంకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో పాటు నానమ్మతాతయ్యలతో కలిసి రెండు అంతస్తుల...

Vishaka: మనవరాలిపై 60 ఏళ్ల వృద్ధుడు పాశవికం.. సంచలన తీర్పు ఇచ్చిన పోక్సో కోర్ట్‌
Vishaka Court
Follow us on

సమాజంలో రోజురోజుకీ విలువలు దిగజారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు ఎంతకైనా బరితెగిస్తారు. వావి వరసలు మరిచి మృగాల్లో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మానవ మృగానికే స్పెషల్‌ పోక్సో కోర్ట్‌ సంచల తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పోక్సో కేసులో విశాఖ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మనవరాలు పై అత్యాచారం చేసిన పాపానికి ఆరుపదుల తాత కు ఇరవైయ్యేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు అయిదు లక్షల జరిమానా విధించింది స్పెషల్ పోక్సో కోర్ట్. వివరాల్లోకి వెళితే.. విశాఖ మల్కాపురంకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో పాటు నానమ్మతాతయ్యలతో కలిసి రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. ఇదే సమయంలో బాలిక తరచూ రెండో అంతస్తులో తన తాత గారి ఇంట్లో చదువుకుంటూ ఉండేది.

ఇదే సమయంలో కంటి రెప్పలా చూడాల్సిన 60 ఏళ్ల వి.శ్యామ్‌ సుందర్‌ (చిన్నారి తాతయ్య) చూపు చిన్నారిపై పడింది. కనీసం మనిషిననే విషయాన్ని కూడా మరిచిపోయి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిచ్చాడు. ఇలా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తల్లికి విషయం తెలియడంతో బాలికను ప్రశ్నించింది. దీంతో తనపై జరిగిన అన్యాయాన్ని ఆమె.. వివరించింది. విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంట్లో అందరినీ చంపేస్తా అని బెదిరించడంతో ఎవరికి చెప్పలేదని చెప్పి ఆవేదన చెందింది.

దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన తల్లి వెంటనే.. మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో చార్జీ షిట్ ఫైల్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నేరం రుజువు కావడంతో కోర్టు సంచలన తీర్పు చెబుతూ శిక్ష ఖరారు చేసింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..