Inter Students: విశాఖలో స్టూడెంట్స్ మిస్సింగ్.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం.. చదువు వద్దు.. పానీపూరీ అమ్మకం ముద్దు అంటూ..

|

Jun 29, 2023 | 8:38 AM

విశాఖ జిల్లాలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు పవన్‌, దిలిప్‌, బాలీల ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. ఈ ముగ్గురికి చదువు అంటే ఇష్టం లేదని.. అందుకనే కాలేజీకి బయలుదేరిన వీరు..  డబ్బుల సంపాదన కోసం హైదరాబాద్ సరైన ప్లేస్ అని ఎంచుకున్నారు. భాగ్యనగరంలో పానీ పూరి అయినా సరే అమ్మి జీవించవచ్చు అని భావించిన ఈ స్టూడెంట్స్.. ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి పారిపోయారు.

Inter Students: విశాఖలో స్టూడెంట్స్ మిస్సింగ్.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం.. చదువు వద్దు.. పానీపూరీ అమ్మకం ముద్దు అంటూ..
Visakha Inter Students
Follow us on

విశాఖ పట్నం లో ఈ నెల 24 నుంచి కనిపించకుండా పోయిన స్టూడెంట్ కేసుని పోలీసులు చేధించారు.  నగరంలోని గాజువాకలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు స్టూడెంట్స్ కె. కోటపాడు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి తిరిగి చేసుకుండా మిస్ అయ్యారు.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నగర పోలీసులు స్టూడెంట్స్ ఆచూకీని  కనుగొన్నారు. విశాఖ లో అదృశ్యమై.. భాగ్యనగరంలో ఉన్నట్లు.. విద్యార్థులకు చదువు అంటే ఇష్టం లేకపోవడంతోనే ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ జిల్లాలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు పవన్‌, దిలిప్‌, బాలీల ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. ఈ ముగ్గురికి చదువు అంటే ఇష్టం లేదని.. అందుకనే కాలేజీకి బయలుదేరిన వీరు..  డబ్బుల సంపాదన కోసం హైదరాబాద్ సరైన ప్లేస్ అని ఎంచుకున్నారు. భాగ్యనగరంలో పానీ పూరి అయినా సరే అమ్మి జీవించవచ్చు అని భావించిన ఈ స్టూడెంట్స్.. ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి పారిపోయారు. కాలేజీకి వెళ్లిన తమ పిల్లలు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది.. నగరంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు స్టూడెంట్స్ ఫోటోలను పంపించడంతో..  ముగ్గురు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్న సమయంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వీరిని గుర్తించారు. విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పవన్‌, దిలిప్‌, బాలీల ఇంటికి క్షేమంగా చేర్చారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..