Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో అమానుషం.. 4 కుటుంబాలు గ్రామ బహిష్కరణ.. నేడు గ్రామానికి అధికారులు
శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డీజే ప్రదర్శన వద్ద రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వైసీపీ, జనసేన మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో ఓ వర్గంవారు నాలుగు కుటుంబాలను టార్గెట్ చేశారు. గ్రామ బహిష్కరణ చేశారు.
టెక్నాలజీతో ఓవైపు మనం పరుగులు పెడుతున్నా… గ్రామాల్లో మాత్రం కుల పెద్దలు అనాగరిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అమానుష ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ పార్టీకి మద్దతు ఇచ్చిన గ్రామ బహిష్కరణకు గురవుతున్నారు. నెల్లూరులో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రపంచం ఎన్నో విషయాల్లో పురోగమిస్తున్నా.. ఇంకా అక్కడక్కడ వివక్షలు, గ్రామ పెద్దల హవా కనిపిస్తుండటం విచారకరం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం టీవీ కండ్రిగలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న ఘర్షణ కారణంగా నాలుగు కుటుంబాలను వెలివేశారు గ్రామస్థులు. నేడు గ్రామానికి రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లనున్నారు. తాము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు పోలీసులు.
శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డీజే ప్రదర్శన వద్ద రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వైసీపీ, జనసేన మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో ఓ వర్గంవారు నాలుగు కుటుంబాలను టార్గెట్ చేశారు. గ్రామ బహిష్కరణ చేశారు.
తాగునీరు, కిరాణా సరుకులు, మందులు ఇవ్వొద్దని గ్రామంలో హుకుం జారీ చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నాలుగు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జనసేన మద్దతుదారులం కాబట్టే… తమను టార్గెట్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కులం.. మరోవైపు పార్టీల మకిలీ.. ఆ కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..