Vijayawada: 3 రోజులుగా స్కూల్ పక్కనే మిస్టరీగా కారు.. అనుమానంతో స్థానికులు వెళ్లి చూడగా

మూడు రోజులుగా కారులో డెడ్‌బాడీ.. హత్యా ? ఆత్మహత్యా ?. బెజవాడలో కలకలం రేపిందీ ఘటన. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య మాత్రం మరో మహిళపై అనుమానం వ్యక్తం చేస్తోంది.

Vijayawada: 3 రోజులుగా స్కూల్ పక్కనే మిస్టరీగా కారు.. అనుమానంతో స్థానికులు వెళ్లి చూడగా
Dead Body In Car
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:07 PM

AP News: విజయవాడలోని పటమటలంక(Patamatalanka)లో కారులో డెడ్‌బాడీ ఉండటం కలకలం రేపింది. వీఎంసీ స్కూల్‌ దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో మృతదేహం లభించింది. డెడ్‌బాడీ మూడు రోజులుగా అక్కడే ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మృతుడిని బాషాగా గుర్తించిన పోలీసులు కారు నెంబర్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. బాషా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పటమటలంకలో కారులో ఉన్న మృతదేహాన్ని బయటకి తీసి, పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ కేసులో బాషా రెండో భార్యగా భావిస్తున్న మహిళను విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఆమె రెండో భార్య కాదని, ప్రియురాలు మాత్రమే అని చెబుతోంది మృతుడు బాషా భార్య. అంతేకాదు బాషా మృతి విషయంలో ప్రియురాలిపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆమె కోసమే ఇక్కడికి వచ్చాడని చెబుతోంది.

అయితే కారులో ఉన్న డెడ్‌బాడీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాషా కండ్రిగలో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. AP 37 BA 5456 అనే ఇండికా కారు నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కారు ఎవరిది ? ఏ రోజు కారు ఇక్కడికి వచ్చింది? అసలు బాషాను ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్యేనా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ హత్య అయితే ఎవరు చేశారని ఆరా తీస్తున్నారు.

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!