AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బిర్యానీ ఇప్పించలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు

ఈ రోజుల్లో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న విషయాలలో గొడవ పడి హత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. చిన్నపాటి ఘర్షణలు హత్యల వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇక్కడ బిర్యానీ ఇప్పటించలేదనే కారణంతో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. స్థానికంగా సేకరించిన సమాచారం మేరకు.. గొల్లపూడి..

Andhra Pradesh: బిర్యానీ ఇప్పించలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు
Biryani
Subhash Goud
|

Updated on: Aug 26, 2024 | 10:15 PM

Share

ఈ రోజుల్లో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న విషయాలలో గొడవ పడి హత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. చిన్నపాటి ఘర్షణలు హత్యల వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇక్కడ బిర్యానీ ఇప్పటించలేదనే కారణంతో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. స్థానికంగా సేకరించిన సమాచారం మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిర్యానీ అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని అన్న చెప్పడంతో తమ్ముడు తీవ్ర అవేశానికి గురయ్యాడు.

దీంతో బిర్యానీని ఇప్పించలేదనే కోపంతో తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాము ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కె ఉమామహేశ్వర రావు తన సిబ్బందితో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హత్య చేసిన తమ్ముడు లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బిర్యానీ ఇప్పించలేదని అన్నను తమ్ముడు హతమార్చాడా లేక మరే ఇతర కారణాల వల్ల ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్