Cricket Betting: క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 10 లక్షలు లాస్.. వత్తిడి తట్టుకోలేక ఓ యువకుడు ఏం చేశాడంటే..
Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొంది. క్రికెట్ బెట్టింగ్‌లతో నష్టపోయిన ఓ యువకుడు భారీ మొత్తంలో అప్పులవడంతో..
Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొంది. క్రికెట్ బెట్టింగ్‌లతో నష్టపోయిన ఓ యువకుడు భారీ మొత్తంలో అప్పులవడంతో.. తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన బ్రహ్మయ్య.. బీసెంట్ రోడ్డులోని ఫ్యాన్సీ షాప్‌లో పనిచేస్తూ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అయితే, క్రికెట్ బెట్టింగ్‌లతో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. షాపులో ఉన్న ఐదు లక్షల రూపాయలు బెట్టింగ్‌లో పోగొట్టడమే కాకుండా.. మరో ఐదు లక్షల రూపాయలు అప్పులు చేశాడు. మొత్తం పది లక్షల రూపాయలు అప్పు కావడంతో.. బ్రహ్మయ్య హైదరాబాద్ వెళ్లిపోయాడు. అప్పుల ఒత్తిడితో తిరిగి విజయవాడ వచ్చాడు బ్రహ్మమయ్య. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండకు వెళ్లిన బ్రహ్మయ్య.. అక్కడ పురుగుల ముందు కలిపిన కూల్ డ్రింక్ తాగాడు. ఆపై వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు బ్రహ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో బ్రహ్మయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
KCR vs BJP: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..
New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!