AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YV Subba Reddy: అమర్ భావోద్వేగం పై స్పందించిన వైవీ సుబ్బా రెడ్డి..

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో వైసీపీ అధిష్టానం కొత్త ఇన్‎చార్జ్‎లను నియమిస్తూ ముందుకు సాగుతోంది. అనకాపల్లిలో కూడా ఇన్‎చార్జ్‎లను మార్పు చేశారు. గతంలో ఉన్న గుడివాడ అమర్నాధ్‎ని తొలగించి అతని స్థానంలో భరత్ ను నియోజకవర్గ ఇన్‎చార్జిగా నియమించింది.

YV Subba Reddy: అమర్ భావోద్వేగం పై స్పందించిన వైవీ సుబ్బా రెడ్డి..
Yv Subba Reddy
Srikar T
|

Updated on: Jan 04, 2024 | 2:40 PM

Share

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో వైసీపీ అధిష్టానం కొత్త ఇన్‎చార్జ్‎లను నియమిస్తూ ముందుకు సాగుతోంది. అనకాపల్లిలో కూడా ఇన్‎చార్జ్‎లను మార్పు చేశారు. గతంలో ఉన్న గుడివాడ అమర్నాధ్‎ని తొలగించి అతని స్థానంలో భరత్ ను నియోజకవర్గ ఇన్‎చార్జిగా నియమించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ కొత్త ఇన్‎చార్జ్ పరిచయ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాధ్ కంటతడి పెట్టుకున్నారు. అనకాపల్లి ప్రజలు తనకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారన్నారు. భరత్‎ను గెలిపించి సీఎం జగన్‎కు కానుకగా ఇవ్వాలన్నారు.

ఇదిలా ఉంటే అమర్నాధ్ భావోద్వేగంపై వైపీ సుబ్బారెడ్డి స్పందించారు. ఉత్తరాంధ్ర ఇన్‎చార్జ్‎‎గా విశాఖ చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి మంత్రి అమర్నాధ్ కు ధైర్యం చెప్పేందుకు వెళ్లారు. పదేళ్లుగా అనకాపల్లిని అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి భావోద్వేగం ఉంటుందన్నారు. అందుకే ఇంటికి వెళ్ళి అమర్ భావోద్వేగాన్ని పంచుకున్నా అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అమర్‎కు ఇంతకంటే మంచి భవిష్యత్ ఉంటుందని కుటుంబ సభ్యులకు మాటిచ్చినట్లు తెలిపారు. సీఎం జగన్ అమర్నాధ్‎కు సముచిత స్థానం కల్పించినట్లు వెల్లడించారు. త్వరలోనే అపోహలకు తెరపడుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..