Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Undavalli Arun Kumar: కోరుకున్నట్లే రియాక్షన్ వచ్చింది.. సజ్జల కామెంట్లపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్..

విభజన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి కామెంట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. విభజన తీరుపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును తిరగతోడద్దంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించడం ఏంటని మూడు రోజుల కిందట విమర్శలు చేశారు ఉండవల్లి.

Undavalli Arun Kumar: కోరుకున్నట్లే రియాక్షన్ వచ్చింది.. సజ్జల కామెంట్లపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్..
Undavalli Arun Sajjala Ramakrishna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 10, 2022 | 8:21 PM

విభజన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి కామెంట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. విభజన తీరుపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును తిరగతోడద్దంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించడం ఏంటని మూడు రోజుల కిందట విమర్శలు చేశారు ఉండవల్లి. రాష్ట్రానికి వైసీపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. దానిపై రియాక్ట్‌ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. సమైక్య రాష్ట్రానికే తాము కట్టుబడి ఉన్నామని, న్యాయవాది చేసిన వాదన తమ వైఖరి కాదని పేర్కొన్నారు. సజ్జల వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ టార్గెట్‌గా అన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే తన వ్యాఖ్యలతో జరుగుతున్న పరిణామాలపై టీవీ9 బరాబర్‌ కార్యక్రమంలో మాట్లాడారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. విభజన తీరుపై తాను అనుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రియాక్షన్‌ వచ్చిందన్నారు. సజ్జల వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థమైందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక ఎవరు ఏమన్నా తాను పట్టించుకోబోనంటూ స్పష్టంచేశారు. విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని.. దానిపై పోరాడుతూనే ఉంటానంటూ తెలిపారు. తన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్యాయంగా విభజించారని వైసీపీ, టీడీపీ రెండు అంటున్నాయి.. తాను దానిపైనే పోరాటం చేస్తున్నానంటూ ఉండవల్లి పేర్కొన్నారు.

విభజన తీరుపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును తిరగతోడద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించడం ఏంటని మూడు రోజుల కిందట విమర్శలు చేశారు ఉండవల్లి. రాష్ట్రానికి వైసీపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. దానిపై రియాక్ట్‌ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల. సమైక్య రాష్ట్రానికే తాము కట్టుబడి ఉన్నామని, న్యాయవాది చేసిన వాదన తమ వైఖరి కాదని పేర్కొన్నారు.

సజ్జల వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న సమయంలోనే టీవీ9 బరాబర్‌ కార్యక్రమంలో మాట్లాడారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. బరాబర్‌లో ఉండవల్లి పూర్తి ఇంటర్వ్యూ రేపు సాయంత్రం 6.30 గంటలకు టీవీ9 తెలుగులో ప్రసారంకానుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ఈ డ్రామా ఆడుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ విమర్శించారు. సజ్జల వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ రియాక్షన్‌కు ఉండవల్లి సంతృప్తి చెందారేమో కానీ.. రెండు రాష్ట్రాల్లో రాజకీయం మాత్రం సెగలు రేపుతూనే ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..