Ugadi 2021: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విధుల్లో ఉత్తమ పనితీరు, ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను పోలీసులకు అందజేయనున్నారు. సివిల్ పోలీసులతో పాటు.. అగ్నిమాపక, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ, ఎస్పీఎఫ్ విభాగాల్లో పని చేస్తూ గత రెండేళ్లలో అత్యుతమ పనితీరు కనిబరిచిని వారికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఉగాది పర్వదినం వేళ 583 మందికి పతకాలు ప్రకటించింది ప్రభుత్వం. పోలీసులు ఎంతో గర్వంగా భావించే.. ఉత్తమ సేవ, కఠిన సేవ, ముఖ్యమంత్రి సేవ, మహోన్నత సేవ పురస్కారాలు పొందిన వారి జాబితాను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే.. రెండేళ్ల క్రితం గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం, విజయవాడ బందరు కాల్వలో పడిపోయిన బాలికను రక్షించిన ఆర్ఎస్ఐ అర్జునరావులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలు అందించనుంది.
Also read:
Telangana: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షం బీభత్సం… పిడుగుపడి ఆరుగురు దుర్మరణం.. భారీగా పంట నష్టం