Ugadi 2021: ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!

Ugadi 2021: ఉగాది పండగతోనే తెలుగువారికి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని..

Ugadi 2021: ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసా.. విష్ణు సహస్రం  కలిగిస్తే ఫలితం ఏమిటంటే..!
Ugadi
Surya Kala

|

Apr 13, 2021 | 6:52 AM

Ugadi 2021: ఉగాది పండగతోనే తెలుగువారికి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నాంది. ఉగాది కనుక తెలుగు వారు మొదటి పండుగకు స్వాగతం పలుకుతూ.. ఇల్లు, వాకిలి, శుభ్రపరుచు కోవటం, తలంటుస్నానాలు, కొత్తబట్టలు ధరించటం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు.

దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ పండుగలలో ఉగాది కూడా ఒక్కటి. ఈ ఉగాదితో ఈ రాష్ట్రాలలో నూతన సంవత్సరాది ప్రారంభమవుతుంది.

హిందువుల కాలెండర్ ప్రకారం చైత్ర మాసాన్ని మొదటి నెలగా భావిస్తారు, ఈ మొదటి నెల ప్రారంభమయిన చైత్ర శుద్ద పాడ్యమి రోజున ఊగాదిగా పండుగ చేసుకుంటారు. ఈ ఊగాదినే మహారాష్ట్రలో “గుడి పాడ్వా“ గా చేసుకుంటారు. ఈ రెండు పండుగల అంతరార్ధం ఒకటే కావున ఈ రెండు పండుగలూ ఒకటే. పేర్లు మాత్రమే వేరు. ఈ నాలుగు రాష్ట్రాలలో పండుగ చేసుకునే విధానాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఉదయాన్నే ప్రారంభమై రాత్రి వరకూ ఉండి వెళ్లిపోతుంది కానీ , పండుగ చేసుకునే విధానంలో మాత్రం రాష్ట్రాలకు, సమాజాలకూ వ్యత్యాసాలు ఉంది.

ఉగాది అంటేనే నూతన సంవత్సరాది కావున..  పండుగను కూడా అంతే నూతనంగా ఆహ్వానించాలి. అయితే మనం ప్రస్తుతం యుగాల్లో నాలుగవది ఐన కలియుగంలో ఉన్నాం. ఇప్పటికే ఈ యుగంలో 5120 సంవత్సరాలు పూర్తయ్యాయి. శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని తాజాగా ఈరోజున (13 ఏప్రిల్‌) శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. ఇక ఉగాది రోజున ఏమి చెయ్యాలి.. ఏమి చెయ్యకూడదు అనే విషయాలను మన పెద్దలు ఎప్పుడో నిర్ధేశించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ఉదయాన్నే అభ్యంగ స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకసారి ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం.

అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ఒక దేవుడు ఉంటాడు..వినాయకుడు రాముడు, కృష్ణుడు, దుర్గ, ఇలా దేవి, దేవతలు అధినాయకులుగా ఉంటారు. వారిని పూజిస్తాం.. అయితే ఉగాది రోజున మాత్రం కలిపురుషుడు అధిదేవత. అందుకనే ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది.

మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉంటుంది. అందుకనే కాలపురుషుని ఉగాది రోజున ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. అంతేకాదు కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం.. కనుక ఈరోజున ఆలయం లో అత్యంత నిష్ఠతో వేద పురోహితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు.

Read Also :  మెనీ ఫెస్టివల్స్.. వన్ లవ్ అంటున్న రాధే శ్యామ్ .. ఉగాది శుభాకాంక్షలతో ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu