
దేశ వ్యాప్తంగా గణపతి మండపాల్లో బుజ్జి గణపయ్య కొలువు దీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. గణపతి నవరాత్రి వేడుకలను ఓ వైపు ఘనంగా జరుపుకుంటుంటే.. మరోవైపు అనేక చోట్ల వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే గణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో గురువారం రాత్రి వినాయక చవితి వేడుకల్లో ఆపశృతి చోటుచేసుకుంది. వినాయకుడు కూర్చోబెట్టి నిమజ్జనానికి తరలిస్తున్న బొలెరో వాహనం.. ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో రాజు(16), బాలుడు మనోజ్(7) మృతి చెందాగా, ధనుష్, రమేష్, వృద్ధురాలు లక్ష్మీలకు గాయాలు అయ్యాయి.
ఎస్ఎంటీ కాలనీలో రాత్రి వినాయక చవితి వేడుకల్లో భాగంగా బోలెరో వాహనంపై విగ్రహాన్ని ఎక్కించారు. డీజె ముందు, కాలనీ వాసులు డ్యాన్సులు వేస్తుండగా డ్రైవర్ వాహనం ఆఫ్ చేసి బండికి తాళాలు తీసుకెళ్లకుండా వాహనానికే పెట్టి భోజనం చేయడానికి వెళ్లాడు. గుంపులో కాలనీకి చెందిన యువకుడు వాహనం కుండే తాళం ఆన్ చెయ్యటంతో బొలెరో వాహానం అదుపుతప్పి వేగంగా ముందు ఉన్న ప్రజల్లోకి దూసుకెళ్లింది. వాహానంపై ఉన్న యువకుడు భయంతో బ్రేక్ తొక్కుండా ఎక్స్ లైటర్ తొక్కటంతో వినాయకుడి ముందు నృత్యం చేస్తున్న రాజు తలపై వాహనం టైర్లు ఎక్కటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదే ప్రమాదంలో అన్నదమ్ములు దనుష్, మనోజ్ (7) రమేష్ తో పాటు వృద్ధురాలు లక్ష్మీలకు వాహనం ఢీ కొట్టింది. గాయపడ్డ ఐదుగురిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం రాజు, మనోజలను కర్నూలు కు తరలించారు. మార్గమధ్యలో రాజు, మనోజ్ మృతి చెందారు. దీంతో మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వచ్చారు. అయితే ఆసుపత్రికి తీసుకొని రాగ అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే మ వాళ్ళు చనిపోయారని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..