AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anakapalle: అప్పటివరకు ఆనందం.. అంతలోనే విషాదం

విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని.. అంతలోనే మృత్యువు కెరటం రూపంలో బలి తీసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

Anakapalle: అప్పటివరకు ఆనందం.. అంతలోనే విషాదం
Nukaratnam -Kanakadurga
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 03, 2024 | 1:08 PM

Share

విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  కెరటం మృత్యువు రూపంలో దూసుకువచ్చి.. అక్కా చెల్లెళ్లను బలి తీసుకుంది. జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లిన వారిద్దర్నీ దూసుకొచ్చిన అల బలి తీసుకుంది.

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంతడి బీచ్‌లోని రాకాసి అలలు ఇద్దరిని మింగేయడం… స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూకరత్నం, కనకదుర్గ… అక్కాచెల్లెల్లు. ఆదివారం కావడంతో… ఇద్దరు తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి-వాడపాలెం తీరంలో గడపడానికి ఆదివారం వచ్చారు.  అలలతో ఆడుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. అయితే ఇద్దరు పోటీపడి అలలకు ఎదురుగా వెళ్లడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వారి పక్కనే ఉన్న శిరీష అనే మహిళ కూడా అలలు ఒక్కసారిగా మీదకు రావడంతో అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే స్పందించిన కొందరు యువకులు శిరీషను కాపాడారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  అక్కాచెల్లెళ్లను మాత్రం కాపాడలేకపోయారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు