ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండా సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. నిన్నటి వరకు నీటి కోసం పెద్దపులులు అటవీప్రాంతం సమీపంలోని గ్రామాల్లోకి వస్తుండటంతో హడలెత్తుతున్న గ్రామస్తులకు చిరుతలు కూడా గ్రామాల్లోకి వస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. తాజాగా జిల్లాలోని దిగువమెట్ట తండాలోని మేకల గుంపుపై చిరుతపులి దాడి చేసింది. తండాలోకి ప్రవేశించిన చిరుత మేకల గుంపు కనిపించడంతో ఒక్కసారిగా దాడి చేసింది. చిరుత దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. చనిపోయిన రెండు మేకల్లో ఓ మేకను చిరుతపులి అక్కడే పలహారం చేసింది. మరి కొన్ని మేకలు చిరుతపులి దాడిలో గాయపడ్డాయి.
దిగువమెట్ట తండా గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు పరిశీలించి చిరుత పులి సంచారాన్ని ధ్రువీకరించారు. చిరుత పులి పాద ముద్రలను గుర్తించారు. చిరుత పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం స్థానికంగా నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత పులి ఆహారం కోసం గ్రామాలలోకి వచ్చినట్లు చెబుతున్నారు.
చిరుతపులి సంచరిస్తున్న అటవీప్రాంతంలోని సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను మేత కోసం అడవిలోకి తీసుకువెళ్లవద్దని సూచిస్తున్నారు… సాధారణంగా వానాకాలంలో చిరుతలు, వన్యమృగాలు అడవి దాటి బయటకు రావని, అయితే ఆహారం లభించకపోవడమో, లేక మరే ఇతర కారణాలతోనో చిరుత సమీప గ్రామాల్లోకి రావడమో జరిగి ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..