Andhra Pradesh: ఎందుకిలా చేశారమ్మా.. ఒకే కుటుంబం.. ఇద్దరు బాలికలు.. ఒకేసారి..
వాళ్ళిద్దరూ వరుసకు అక్క చెల్లెళ్లు..! పెదనాన్న చిన్నాన్న కుమార్తెలు. ఇద్దరూ మైనర్లే..! ఒకరి వయసు 17.. మరొకరిది 14.. వేరు వేరు చోట్ల నివాసం ఉంటున్నారు.. పేద కుటుంబానికి చెందినవారు.. ఒక్కసారిగా రెండు కుటుంబాల్లో కలవరం.. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు ఆసుపత్రిలో చేరారు. హానికరమైన రసాయనం తాగినట్టు వైద్యులు గుర్తించారు. ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.. మరో బాలిక చికిత్స పొందుతుంది.. ఇంతకీ ఆ పేద బిడ్డలు ఎందుకు అంత పని చేశారు..? వివరాలు..
వాళ్ళిద్దరూ వరుసకు అక్క చెల్లెళ్లు..! పెదనాన్న చిన్నాన్న కుమార్తెలు. ఇద్దరూ మైనర్లే..! ఒకరి వయసు 17.. మరొకరిది 14.. వేరు వేరు చోట్ల నివాసం ఉంటున్నారు.. పేద కుటుంబానికి చెందినవారు.. ఒక్కసారిగా రెండు కుటుంబాల్లో కలవరం.. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు ఆసుపత్రిలో చేరారు. హానికరమైన రసాయనం తాగినట్టు వైద్యులు గుర్తించారు. ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.. మరో బాలిక చికిత్స పొందుతుంది.. ఇంతకీ ఆ పేద బిడ్డలు ఎందుకు అంత పని చేశారు..? కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి శనివారం నాడు .. ఇద్దరు మైనర్ల (బాలికలు) ను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు. ఇద్దరూ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. వెంటనే పరీక్షించిన వైద్యులు.. రసాయనం తీసుకున్నట్టు గుర్తించారు. వారిలో ఒకరు మద్దిలపాలెం చైతన్య నగర్ కు చెందిన బాలిక కాగా.. మరొకరు సీతమ్మధార ఆక్సిజన్ టవర్ వెనుక వైపు ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పేద కుటుంబాలకు చెందిన వాళ్లే. చిన్నాన్న పెదనాన్న కూతుర్లు. ఓ బాలిక తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. బాలిక చదువు మధ్యలో మానేసి వస్త్ర దుకాణంలో చేరింది. ఒక్కసారిగా మందు తీసుకోవడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్యం కోసం బంధువులు తరలించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయింది ఆ బాలిక. ఎంవిపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాలిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొంతకాలంగా ఓ యువకుడ్ని ప్రేమిస్తున్న బాలిక.. అతన్ని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి వాళ్లు అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైనట్టు పోలీసులకు తెలిసింది. అయితే బాలిక ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో బాలిక…
14 ఏళ్ల మరో బాలిక ఆత్మహత్య చేసుకున్న బాలికకు సోదరివరస.. ఆమె తండ్రి తండ్రి చనిపోవడంతో తల్లితోనే జీవనం. ఆమె కూడా ఓ షాపులో పనిచేస్తుంది. శనివారం రాత్రి షాపు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా గురుద్వారా సమీపంలో ఆమె క్రిమిసంహారక మందు తీసుకుంది. అనంతరం ఇంటికి వెళ్ళిపోయింది. అస్వస్థతకు గురవడంతో తల్లి ప్రశ్నించింది. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. గుడ్ ఆఫ్టర్నూన్ కేజీఎఫ్ తరలించగా అక్కడ ఆమెకూ చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోదరి ఆత్మహత్య గురించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తల్లితో చెప్పింది బాలిక. ఒకేసారి రెండు వేరువేరు కుటుంబాల్లో సోదరి వరసైన ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం.. ఒకరు ప్రాణాలు కోల్పోవడం.. మరొకరు తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆ కుటుంంబంలో విషాదం అలముకుంది. ఏదైనా సమస్య ఉంటే.. పెద్దలతో చెప్పి సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..