వినాయక నిమజ్జనం తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.. పాపం, అంతలోనే..

అన్ని పండగల కన్నా వినాయక చవితిని అందరూ చాలా ఇష్టంగా.. ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అంతా కలిసిమెలసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి.. నిమజ్జనం వరకు ఎంతో హాడావుడిగా ఉంటుంది.

వినాయక నిమజ్జనం తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.. పాపం, అంతలోనే..
Kadapa News
Follow us
Sudhir Chappidi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 09, 2024 | 4:31 PM

అన్ని పండగల కన్నా వినాయక చవితిని అందరూ చాలా ఇష్టంగా.. ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అంతా కలిసిమెలసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి.. నిమజ్జనం వరకు ఎంతో హాడావుడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది.. పండగ వరకు బాగానే ఉన్నా నిమజ్జనం సమయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు.. ప్రాణాంతకంగా మారుతున్నాయి.. నిమజ్జనం వేళ వాగులో ఇద్దరు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం..

కడప జిల్లాలోని కమలాపురం విరుపునాయని పల్లి మండలంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. మగుమూరు వంకలో నిమజ్జనానికి వచ్చి ఈతకు దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పులివెందుల నియోజకవరిగమలోని వేంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. వేంపల్లి నుంచి పక్కనే ఉన్న వీరమనేనిపల్లిలోని మగమూరు వంకలో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చిన కొందరు యువకులు.. గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం వంకలో ఈత కొట్టేందుకు దిగారు. వారిలో రాజా, వంశీ అనేవారు ఈత కొడుతుండగా లోతులోకి వెళ్లి నీటిలో కొట్టుకుపోయారు. అయితే, గమనించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చాలా దూరం వీరిద్దరూ కొట్టుకువెళ్లినట్లు గుర్తించారు.. వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వారు దొరకకపోవడంతో ఫైర్, NDRF సిబ్బందికి సమాచారం అందించారు.

వీడియో చూడండి..

నిమజ్జన కార్యక్రమాలలో యువత ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న చిన్న తప్పిదాలు కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతాయని.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం అనంతరం వీటిలోకి దిగకుండా, ఇంటికి వెళ్లి పోతే ఎటువంటి ప్రమాదాలు జరగవని పేర్కొంటున్నారు. బాణసంచాను కాల్చే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, ఊరేగింపు సమయంలో మద్యం తాగొద్దంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..