AP Rains: తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి ఈ ప్రాంతాలకు అలెర్ట్…
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలని అధికారులు సూచించారు.
వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ 2024 సెప్టెంబర్ 9న ఉదయం 08 .౩౦గంటలకు వాయవ్య బంగాళాఖాతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.2 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పూరీ (ఒడిశా)కు తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్ (ఒడిశా)కు నైరుతి దిశగా 90 కిలోమీటర్లు దూరంలో, గోపాల్ పూర్ (ఒడిశా)కు తూర్పు-ఈశాన్యంగా 140 కిలోమీటర్లు దూరంలో, చాంద్బలి (ఒడిశా)కి దక్షిణ నైరుతి దిశగా 140 కిలోమీటర్లు దూరంలో, కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఈశాన్యంగా 260 కిలోమీటర్లు దూరంలో, దిఘా (పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు వాయువ్య దిశగా పయనించి తదుపరి 3 గంటల్లో పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా మీదుగా మరింత వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రం వరకు తీవ్ర వాయుగుండం తీవ్రతను కొనసాగించి, ఈ రోజు అనగా 9వ తేదీ అర్ధరాత్రికి క్రమంగా వాయుగుండముగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత రాగల 24గంటల్లో ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది.
సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు బికనీర్, సికార్, ఖజురహో, బిలాస్పూర్, పూరీ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండము కేంద్రము మధ్యగా , అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
మంగళవారం, బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ :-
———–
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
మంగళవారం, బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.