Vijayawada: నీలాంటోళ్లే అన్న ఈ సొసైటీకి కావాల్సింది.. వారికి ఉచితంగా గ్యాస్ స్టవ్ రిపేర్

సాయమే దైవం.. అవసరమున్న మనిషికి ఆ సమయంలో తోడుగా నిలబడం కంటే మంచి ఏముటుంది చెప్పండి. విజయవాడలో వరదలతో ఎందరో సతమతమయ్యారు. వారి ఇళ్లలోని వివిధ వస్తువులు వరద నీటిలో మునిగి పని చేయకుండా రిపేర్‌కు వచ్చాయి.

Vijayawada: నీలాంటోళ్లే అన్న ఈ సొసైటీకి కావాల్సింది.. వారికి ఉచితంగా గ్యాస్ స్టవ్ రిపేర్
Gas Stove Free Service
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 09, 2024 | 1:38 PM

విజయవాడ వదరలతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. చాలా ఇళ్లు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోని సామాన్లు కూడా వరదల్లో మునిగిపోయాయి. దీంతో వివిధ రకాల వస్తువులు నీటి ఎద్దడికి పాడయ్యాయి. ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషిన్స్, గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్‌కు వచ్చాయి. వాహనాలకు ఇన్సురెన్స్ ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామి ఇచ్చారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ కోసం.. కొందరిని నియమించే ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు విజయవాడ వరద బాధితులకు తమ వంతు చేయూత అందిస్తున్నారు. విజయవాడ విధ్యాదరపురంలో ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. వరద బాధితుల సహాయార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశాడు. వరదల కారణంగా ఎవరివైనా గ్యాస్ స్టవ్‌లు రిపేర్‌కి వస్తే.. వచ్చి ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో ట్రెండ్ అవుతోంది. ఆయన గుణాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన వృత్తి ద్వారా వరద బాధితులకి సాయం చేయాలనే ఆలోచన చేయడం నిజంగా గొప్ప విషయమని.. సొసైటీ కావాల్సింది ఇలాంటివాళ్లే అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు.. విజయవాడలో క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో నష్టం అంచనా వేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. మొబైల్‌ యాప్‌ ద్వారా బాధితులకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తామని.. సర్వే సమయంలో బాధితులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ ఆర్పీ సిసోడియా కోరారు. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నుంచి మూడు రోజులు పాటు రెవెన్యూ శాఖ ఎన్యూమరేషన్‌ చేస్తుందని..ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సిసోడియా సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.