Big News Big Debate LIVE: ఏపీ రాజధానిగా విశాఖకే జగన్‌ మొగ్గు.. సాధ్యం కాదని విపక్షాలు ఎందుకంటున్నాయి.?

త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన ఉంటుందని పదేపదే మంత్రులు చెబుతూ వచ్చారు. ఇదంతా పాతపాటే అనుకున్న విపక్షాలు మంత్రుల మాటలను లైట్‌గా తీసుకున్నాయి.. కానీ ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్‌ రెడ్డి అదే విషయాన్ని కన్ఫామ్‌ చేసేశారు. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల మీట్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు.. ఏపీలోని మూడు...

Big News Big Debate LIVE: ఏపీ రాజధానిగా విశాఖకే జగన్‌ మొగ్గు.. సాధ్యం కాదని విపక్షాలు ఎందుకంటున్నాయి.?
Tv9 Big News

Updated on: Jan 31, 2023 | 7:18 PM

త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన ఉంటుందని పదేపదే మంత్రులు చెబుతూ వచ్చారు. ఇదంతా పాతపాటే అనుకున్న విపక్షాలు మంత్రుల మాటలను లైట్‌గా తీసుకున్నాయి.. కానీ ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్‌ రెడ్డి అదే విషయాన్ని కన్ఫామ్‌ చేసేశారు. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల మీట్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు.. ఏపీలోని మూడు ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి రేపాయి. పార్టీలన్నీ మరోసారి తమ విమర్శలను పదునుపెట్టాయి. లీగల్‌ సవాళ్లు.. పొలిటికల్‌ అభ్యంతరాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న రాజధాని వ్యవహారం మరోసారి రచ్చరచ్చ చేస్తోంది.

కొద్ది రోజులుగా మంత్రులు ఇదే విషయం పదేపదే చెబుతున్నారు… ఉగాదికే ఆ మాటకొస్తే కొత్త విద్యాసంవత్సరం నుంచే విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఫుల్‌ క్లారిటీతో చెప్పారు. కానీ విపక్షాలు ఈ మాటలను లైట్‌గా తీసుకున్నాయి. సాంకేతిక కారణాలతో విశాఖ రాజధాని సాధ్యం కాదంటూ కౌంటర్లు ఇచ్చాయి. అయితే విపక్షాల మాటలను పటాపంచలు చేస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. రాజధానిపై తన మనసులో మాట ఢిల్లీ వేదికగా బయటపెట్టారు. ఢిల్లీలో ఇన్వెస్టర్ల మీట్‌లో సీఎం జగన్‌ అక్కడ ప్రకటన రాగానే.. ఉత్తరాంధ్ర పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై మరో అప్‌డేట్‌ వెంటనే ఇచ్చేశారు.

ఇద్దరి ముఖ్యులు చేసిన ప్రకటనలతో అలర్ట్‌ అయిన విపక్షాలు దీనిపై ఆరా తీయడంతో పాటు విమర్శలకు దిగాయి. వైసీపీ మినహా పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ అమరావతికి మద్దతు ప్రకటించాయి. అటు సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గెప్పించారు. అటు సీఎం ప్రకటన రాగానే విశాఖలో అనుకూలంగా ఉన్న భవనాలపై చర్చ కూడా మొదలైంది. గతంలోనే కొన్ని భవనాలు అనుకున్నా ఇప్పుడు భీమిలి రోడ్డులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నారు అధికారులు. అటు విపక్షాలు మాత్రం న్యాయపరమైన పోరాటంతో పాటు అడ్డుకునేందుకు రాజకీయ ఉద్యమాలను బలంగా చేయాలని భావిస్తున్నాయి. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి. ఇదే అంశంపై బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబెట్‌లో పలువరు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఏపీ రాజధానిపై బిగ్ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ ఇక్కడ చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..