ఏపీలో పోటీ నువ్వా – నేనా అన్నట్టు సాగింది… విజయంపై ఎవరికి వారు బయటకు ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం టెన్షన్ ఫీలవుతున్నారు. ప్రతి ఒటూ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైమ్ పోస్టల్ ఓటింగ్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో అధికంగా తమకే పడతాయన్న అభిప్రాయంతో టీడీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పోస్టల్ ఓట్ల వాలిడిటీ విషయంలో మినహాయింపులు ఇవ్వాలని ఈసీని కోరింది. దీంతో ఇటీవల రూలింగ్ కూడా ఇచ్చింది. అయితే నిబంధనలకు విరుద్దంగా టీడీపీ కోరగానే ఈసీ రూలింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. దీనిపై కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అసలు పోస్టల్ ఓట్లు ఎందుకు కీలకంగా మారాయి.. పార్టీలు దీనిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉందా? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఇవే అంశాలపై ఇవాళ్టీ బిగ్ షో దిగువన చూడండి..