Tirumala: మృతిచెందిన యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు.. చూసి నివ్వెరపోయిన అధికారులు..

| Edited By: Ram Naramaneni

May 18, 2021 | 8:40 AM

TTD Vigilance: తిరుమలోని ఓ యాచకుడి ఇంట్లో లక్షలాది రూపాయలు లభించాయి. బిచ్చగాడి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన టీటీడీ అధికారులకు ఇంటినిండా

Tirumala: మృతిచెందిన యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు.. చూసి నివ్వెరపోయిన అధికారులు..
Ttd Vigilance
Follow us on

TTD Vigilance: తిరుమలోని ఓ యాచకుడి ఇంట్లో లక్షలాది రూపాయలు లభించాయి. బిచ్చగాడి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన టీటీడీ అధికారులకు ఇంటినిండా డబ్బు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. లక్షా.. రెండు లక్షలు ఏకంగా 10లక్షల నగదు ఆ ఇంట్లో లభించడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ డబ్బంతా తిరుమలలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించి మృతిచెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఇంటి నుంచి టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసాచారికి 2007లో తిరుమల సమీపంలోని శేషాచలనగర్‌లో ఇంటి నెం.75ను పొందాడు. అప్పటినుంచి తిరుమలలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ, బిక్షాటన చేస్తూ భారీగా నగదును పోగు చేసుకున్నాడు. తాను సంపాదించిన సొమ్మును ఇంట్లోనే భద్రపరుచుకుంటూ వచ్చాడు. అయితే.. గతేడాది ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు.

శ్రీనివాసాచారికి వారసులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ సదరు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగానే సోమవారం విజిలెన్స్‌ అధికారులు రెవెన్యూ అధికారులు శేషాచలనగర్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇంట్లోని పలు వస్తువులను తనిఖీ చేయగా రెండు ట్రంకు పెట్టెల్లో చిల్లర నగదు, కరెన్సీ నోట్లు పెద్దఎత్తున కనిపించాయి. ఇందులో రద్దు చేసిన పాత రూ.1,000, రూ.500 నోట్లు కూడా ఉన్నాయి. ఇవి సుమారు రూ.10లక్షలు ఉంటాయని.. వాటిని స్వాధీనం చేసుకొని ట్రెజరీకి తరలించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Also Read:

Mother kills Children: భర్త తిట్టాడని భార్య ఘాతుకం.. ఇద్దరు కన్నబిడ్డల గొంతు కోసి తానూ ఆత్మహత్య.. పిల్లలిద్దరు మృతి

COVID-19 Woman: కరోనా సోకిన 45 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు