TTD Vaikunta Darshan: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. దర్శనం చేసుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరచుకున్నాయి. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. మొదట వీఐపీలు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని తితిదే ప్రారంభించింది..

TTD Vaikunta Darshan: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. దర్శనం చేసుకున్న ప్రముఖులు
TTD Vaikunta Dwara Darshan in Tirumala

Updated on: Dec 30, 2025 | 8:23 AM

తిరుపతి, డిసెంబర్‌ 30: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం తెరచుకుంది. సోమవారం అర్ధరాత్రి 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వార తలుపులను తెరిచారు. దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. అర్చక స్వాములు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1.20 మధ్యలో ప్రముఖుల దర్శనాలను ప్రారంభించారు. ఉదయం 5:30 నిమిషాలకు డిప్ కలిగిన టోకెన్లు అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టోకెన్లు లేని భక్తులను జనవరి 2నుంచి నేరుగా రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులు టోకెన్ లో ఉన్న సమయానికే తిరుమలకు రావాలని సూచించారు. భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు డిప్‌లో కేటాయించిన టోకెన్‌ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అనుకున్న దాని కన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. కనివిరిగని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించాం. భక్తులందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సేపట్లో టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన అన్నారు.

వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రముఖులు

వైకుంఠ ద్వార దర్శనం మొదలవగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. అలాగే సినీనటుడు నారా రోహిత్ దంపతులు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కూతుళ్లు సుస్మిత, శ్రీజ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాష్ట్ర శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రులు అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సవిత, నిమ్మల రామానాయుడు, నటుడు శివాజీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

 

అలాగే రాష్ట్రమంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల అన్నారు. ప్రముఖుల దర్శనాలను కూడా తగ్గించి సామాన్య భక్తులకు పెద్ద పీట వేశారు. మిగతా రోజులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.