AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: జాగ్రత్తగా వెళ్లు నాన్నా.. తండ్రిని ఆటో ఎక్కించాడు.. బైక్‌పై ఇంటికి బయల్దేరగా.. ఇంతలో.!

పదో తరగతి పరీక్షలు రాసి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ యువకుడిని విధి వంచించింది. తండ్రిని సురక్షితంగా ఆటో ఎక్కించి పంపిన కొద్దిసేపటికే ఐస్‌క్రీం బండి రూపంలో మృత్యువు కబళించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Andhra: జాగ్రత్తగా వెళ్లు నాన్నా.. తండ్రిని ఆటో ఎక్కించాడు.. బైక్‌పై ఇంటికి బయల్దేరగా.. ఇంతలో.!
Victim Photo
Ravi Kiran
|

Updated on: Apr 23, 2026 | 12:21 PM

Share

జీవితం ఎంత విచిత్రమైనదో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రయోజకుడవుతాడని ఆశించిన ఆ ఒక్కగానొక్క కుమారుడు.. కళ్లముందే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థి, కనీసం ఆ ఫలితాలు కూడా చూడకుండానే అనంతలోకానికి వెళ్లిపోవడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.

ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో హైదర్‌బాషా (16) అనే యువకుడు మృతి చెందాడు. నల్లమాడ మండలం గోపేపల్లికి చెందిన చాంద్‌బాషా, సకీనా దంపతులు బతుకుదెరువు కోసం ఇందుకూరుకు వలస వచ్చారు. బుధవారం ముదిగుబ్బలో జరిగిన ఒక శుభకార్యానికి తండ్రీకొడుకులిద్దరూ వెళ్లారు. పని ముగించుకున్నాక, తండ్రిని ఆటో ఎక్కించి పంపిన హైదర్‌బాషా, తాను బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. కానీ విధి మరోలా తలచింది. దారి మధ్యలో ఎదురుగా వస్తున్న ఐస్‌క్రీం బండిని ఢీకొట్టడంతో, ఆ బండికి ఉన్న ఇనుప రేకు మెడకు బలంగా తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే తండ్రితో కలిసి నవ్వుతూ గడిపిన ఆ పిల్లాడు, ఇప్పుడు లేడన్న వార్తను ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. ఒకేషనల్ సర్టిఫికెట్లు అందుకుని సంతోషంగా వస్తున్న తరుణంలో మృత్యువు పగబట్టినట్లు ఎదురొచ్చింది. సీఐ శివరాముడు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చేతికి అందిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చదువుకుని గొప్ప స్థాయికి వెళ్తాడనుకున్న బిడ్డ, ఇలా రోడ్డు ప్రమాదంలో బలికావడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

Follow Us
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!