AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: రోజు రోజుకు పడిపోతున్న టమాట ధరలు.. ఆందోళనలో రైతులు.. ఇవాళ్టి ధర ఎంతో తెలుసా..

టమాటా రైతులకు రోజురోజుకూ ఎనిమీస్ పెరుగుతున్నారు. దెబ్బమీద దెబ్బ పడుతున్నా... కోలుకొని సాగు చేస్తున్న ఈ రైతులపై మరో పిడుగు పడింది. అది రైతులను కంటతడి పెట్టిస్తోంది. దాని ఎఫెక్ట్‌తో టమాట రైతు మరింత కుంగిపోతున్నాడు.

Tomato Price: రోజు రోజుకు పడిపోతున్న టమాట ధరలు.. ఆందోళనలో రైతులు.. ఇవాళ్టి ధర ఎంతో తెలుసా..
Tomato Price
Sanjay Kasula
|

Updated on: Nov 29, 2022 | 10:30 AM

Share

ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఆకాశానికి అంటిన ధరలు ఒక్కసారిగా నేలమీదికి చేరిపోయాయి. పండించిన రైతుల్లో ఆశలు రేపిన టమోట ధరలు ఇప్పుడు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. ఒక్కసారిగా టమాట ధరలు కుప్పకూలిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌ కంటే దారుణంగా పడిపోయాయి. నిన్నటి వరకు రెండంకెళ్లో ఉన్న ధర ఒక్కసారిగా రెండు రూపాయలకి పడిపోయింది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలా తయారయ్యింది టమాట ధరల పరిస్థితి..టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరను పక్కన పెడితే.. కనీసం మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కర్నూలు పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి.. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి అవుతుంది.

అయితే కిలో టమోటాల ధర రెండు రూపాయిలుగా పలుకుతోంది. దీంతో రైతులు బోరుమంటున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాను అమ్మలేక, అలాగని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్‌లోనే వాటిని పారబోస్తున్నారు. కనీస మద్దతు ధర ఉండేలా.. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బు అయినా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అటు వరంగల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. పది రోజుల క్రితం వరకు కిలో 40 పలికిన ధర నిన్నటి నుండి కిలో రూ. 10లకే పడిపోయింది.. ఉన్నట్టుండి ధర పడి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..టమాటను పొలం నుంచి తీసి మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

Follow Us
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం