Tomato Price Drop Down: నేల చూపు చూస్తోన్న టమాటా ధర.. కప్పు టీ ధర కంటే కిలో టమాటా ధర తక్కువ..

|

Dec 31, 2024 | 8:28 AM

భారతీయుల వంటల్లో టమాటాకు అత్యంత ప్రాధాన్య ఉంది. టమాటా లేని వంట లేదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఈ టమాట ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒకొక్కసారి కిలో టమాటా వందకు పైగా చేరుకుని.. వినియోగదారులకు షాక్ ఇస్తే.. ఒకొక్కసారి కిలో టమాటా కనీసం రూపాయి కూడా పలక కుండా రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. నిన్నా మొన్నటి వరకు సామాన్యులను చుక్కలు చూపిన టమాటా ధర.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఛాయ్ కంటే చీప్‌గా మారిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tomato Price Drop Down: నేల చూపు చూస్తోన్న టమాటా ధర.. కప్పు టీ ధర కంటే కిలో టమాటా ధర తక్కువ..
Tomato Price Drop Down
Follow us on

ఇన్ని రోజులు కొండెక్కి కూర్చొన్న టమాటా.. ఇప్పుడు అమాంతం లోయలో పడిపోయింది. నంద్యాల జిల్లా ప్యాపిలిలో టమాట ధర రోజురోజుకు పతనమవుతోంది. మార్కెట్‌లో కిలో టామాట ఒక్క రూపాయికి పడిపోయింది. 20 కిలోల టామాట బాక్స్‌ 50 నుంచి 60 రూపాయాలు మాత్రమే పలుకుతుంది. 20 కిలోల మంచి క్వాలిటీ టమాట బాక్స్‌ విలువ కేవలం 90 రూపాయలే ఉంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచే ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగా ఉంటుంది. అయితే ఇన్ని రోజులు కాసులు కురిపించిన టమాట.. ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా పలకకపోవటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్​లలో ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి దక్కడం కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు పతకం కావడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధరకు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమాట మార్కెట్‌కు తీసుకొస్తే… తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా రావటం లేదని.. అధికారులు చొరవ చూపి టమాటాకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరుతున్నారు. పలుచోట్ల కూలీల ఖర్చు కూడా రావడం లేదని రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు రైతు నుంచి కొనుగోలు చేసే ధర తక్కువ.. వినియోగదారునికి అమ్మే ధర ఎక్కువగా ఉంటుందని సామాన్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..