సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. గంటలు వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది.. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాట జరిగి.. ఆగురుగురు మరణించగా.. 48 మంది గాయపడ్డారు.
అయితే.. బైరాగిపట్టెడలో బారికేడ్లు లేకపోవడం వల్లే తొక్కిసలాట.. జరిగినట్లు పేర్కొంటున్నారు. టీటీడీ మంజూరు చేసే వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల కోసం బుధవారం ఉదయమే బైరాగిపట్టెడ సెంటర్‌కు భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తులను పంపించారు.
ఈ క్రమంలోనే.. రాత్రి ఓ భక్తురాలు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించేందుకు డీఎస్పీ రమణకుమార్ గేటు తీశారు. దీంతో భక్తులను లోపలికి పంపిస్తున్నారేమోనంటూ అక్కడికి భక్తులు చేరుకున్నారు.. అయితే.. గేటు ఎందుకు తీశారో భక్తులకు చెప్పడంలో డీఎస్పీ వైఫల్యం చెందినట్లు సమాచారం.. దీంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.. గేటు దగ్గర పరిస్థితి కంట్రోల్ చేయడంలో పోలీసుల వైఫల్యం చెందారని అధికారులు పేర్కొంటున్నారు..
తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు.. డీఎస్పీ రమణకుమార్ వల్లే తొక్కిసలాట జరిగిందని రిపోర్ట్ఇచ్చారు. అంతేకాకుండా.. సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడ లేడని రిపోర్ట్ లో పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము 4గంటల నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ప్లాన్ చేసింది.. నిన్న ఉదయం నుంచే అన్ని సెంటర్లకు వేలాదిగా భక్తులు పోటెత్తడంతో.. రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి నుంచే టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది.. బైరాగిపట్టెడ దగ్గర టోకెన్ల జారీ మొదలుపెట్టకముందే తొక్కిసలాట జరిగింది.
అధికారుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
తిరుపతి తొక్కిసలాట వెనక అధికారుల వైఫల్యం ఉందని.. తొక్కిసలాట ఘటన ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాత తేలుతుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న టీటీడీ ఛైర్మన్.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులను పరామర్శించాక సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన చేస్తారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని.. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని.. టీటీడీ ఈవో శ్యామలా రావు తెలిపారు. పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలా రావు పరామర్శించారు.
Tirupati Stampede Live Updates: ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష.. లైవ్ అప్డేట్స్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..