Andhra Pradesh: బైక్ నడుపుతుండగా సీట్‌ కింద బుస్‌..బుస్‌ సౌండ్స్‌.. చెక్ చేయగా షాక్..

కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి వింటే షాకింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని తిరుపతిలో జరిగింది.

Andhra Pradesh: బైక్ నడుపుతుండగా సీట్‌ కింద బుస్‌..బుస్‌ సౌండ్స్‌.. చెక్ చేయగా షాక్..
Ap News

Updated on: Mar 14, 2022 | 7:51 PM

AP Viral News: కొన్ని.. కొన్ని సంఘటనలు గురించి వింటే షాకింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని తిరుపతి(Tirupati)లో జరిగింది. ఎమ్.ఆర్ పల్లికి చెందిన జీతూ అనే యువకుడు ఎప్పట్లానే తన బైక్ పై ప్రయాణిస్తున్నాడు.  ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జి దాటుతుండగా ఉన్నట్టుండి బైక్ నుంచి ఏదో సైండ్స్ వచ్చాయి. ఏమైనా ట్రబుల్ ఏమో అని చూడగా.. లోపల పాము దర్శనమివ్వడంతో అతడు  కంగుతిన్నాడు. బైక్ లోపల పాము కనిపించింది. కాస్త కదిలించగా.. అది  బయటకు వచ్చే ప్రయత్నం చేసింది కానీ, వీలు కుదరలేదు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన యువకుడు బైక్ ను నడిరోడ్డుపై ఆపేశాడు.  లోపల దాక్కున్న పామును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడి.. చివరికి అతి కష్టం మీద వెలికి తీశాడు. ఈ ఘటనతో రోడ్డుపై సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. బైక్ నుంచి పామును బయటకు తీసిన అనంతరం.. స్థానికులు దాన్ని చంపేశారు. దీంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంటి బయట పార్క్ చేసి వదిలేసే బైకులు లేదా స్కూటర్లను నడపడానికి ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే..  అనుకోని అతిథులు ఇలా అకస్మాత్తుగా వచ్చి హడలగొట్టే ప్రమాదం ఉంది.

Also Read: చేపలు చిక్కుతాయని వల వేస్తే ఇవి దొరికాయ్.. జాలర్లకు పండగే పండుగ.. కేజీ ధరెంతో తెలిస్తే కంగుతింటారు..

Viral Photo: అందం అంటే ఏంటి అంటే ఈమెను చూపించవచ్చు.. సౌత్ ఇండియా సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?