Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

|

Feb 24, 2023 | 7:00 AM

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా శుక్రవారం (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అలాగే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Srivari Temple
Follow us on

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా శుక్రవారం (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అలాగే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటా సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ కానుంది. ఈమేరకు దర్శన టికెట్ల విడుదలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

మరోవైపు తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని తిరిగి ప్రారంభించింది టీటీడీ. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగా 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. ఇక మార్చి నుంచి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..