తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం ఉదయం నుండి పునః ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు చేంత 5 వేల దివ్యదర్శనం టోకెన్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి కేటాయిస్తున్నారు.
భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు పొందాలని కోరింది.
భక్తిసాగరంలో ముంచెత్తిన బాలకాండ అఖండ పారాయణం
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు 15వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది.
బాలకాండలోని 71 నుండి 73వ సర్గల వరకు గల 89 శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాలు కలిపి మొత్తం 114 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..