Andhra News: వెరైటీ దొంగ.. దోచుకున్న తర్వాత ఇతను చేసే పని తెలిస్తే.. అవ్వాకవ్వాల్సిందే!

గత 30 ఏళ్లుగా కేవలం రాత్రి పూటే దొంగతనాలు చేస్తూ పలు రాష్ట్రాల పోలీసులకు చిక్కకుంగా తిరుగుతున్న ఒక కేటుగాన్ని తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 33 గ్రాముల బంగారు నగలు, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Andhra News: వెరైటీ దొంగ.. దోచుకున్న తర్వాత ఇతను చేసే పని తెలిస్తే.. అవ్వాకవ్వాల్సిందే!
Tirupati Crime

Edited By:

Updated on: Sep 12, 2025 | 5:50 AM

గత 30 ఏళ్లుగా కేవలం రాత్రి పూటే దొంగతనాలు చేస్తూ పలు రాష్ట్రాల పోలీసులకు చిక్కకుంగా తిరుగుతున్న ఒక కేటుగాన్ని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని తమిళనాడు రాష్ట్రం తిరుచందూరుకు చెందిన తంగముత్తుగా గుర్తించారు. రాత్రి పూట మాత్రమే దొంగతనాలు చేసే ఈ అంతర్రాష్ట్ర దొంగకు పెద్ద నేర చరిత్రనే ఉందని పోలీసుల దర్యాప్తులో తెలింది. తంగముత్తు పై ఇప్పటికే పలు రాష్ట్రాలలో 170 కి పైగా దొంగతనం కేసులు నమోదైనట్టు పోలీసుగు గుర్తించారు. సొంత రాష్ట్రం తమిళనాడుతో పాటు కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో దొంగతనం చేసిన క్రైం రికార్డు ఉన్నట్లు గుర్తించారు.

ఒక్కసారి ఏ ఇంటినైనా టార్గెట్ చేశాడంటే ఇక అంతే. ఆ ఇల్లు గుళ్ళ చేయకుండా వెళ్ళని నైజం తంగముత్తుదని తెలుసుకుని పెద్ద పేరు మోసిన దొంగగా తేల్చారు. తాళాలు వేసి వున్న ఇండ్లు, నగల దుకాణాలే అతని టార్గెట్ అని విచారణ తెలుసు కున్న పోలీసులు ఇక దొంగతనం చేసిన తరువాత ఆ ఇంటిలోనే వంట చేసుకొని తినేసి వెళ్ళటం తంగముత్తు స్టైల్ అని తెలిసి షాక్ కు గురయ్యారు. ఇలా 30 ఏళ్లుగా ఒంటరిగా దొంగ తనాలు చేస్తూ జీవనం సాగిస్తున్న దాదాపు 65 ఏళ్ల తుంగముత్తు తిరుపతిలో ఒక దొంగతనం చేసి తమిళనాడు పోలీసులకు పట్టుబడటంతో పశ్చాతాపానికి గురైయ్యాడు. ఎన్నో దొంగతనాలకు పాల్పడినా దొరకని తంగముత్తు తిరుపతి వద్ద దొంగతనం చేసి పట్టుబడటంతో ఇకపై జీవితంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేయరాదని నిర్ణయించుకున్నాడు. శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఒట్టు పెట్టుకుని మరీ తంగముత్తు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

4 ఏళ్ల క్రితం గాజులమండ్యంలోని ఒక ఇంటిలో దొంగతనం చేసి దొంగిలించిన సొత్తుతో తమిళనాడుకు పారిపోగా అప్పటి నుంచి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతూ ఉన్న తంగముత్తు ఒక కేసులో తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డాడు. 3 ఏళ్ల పాటు జైలులో ఉన్న తంగముత్తు రెండు నెలలక్రితం విడుదలైయ్యాడు. ఒక చోరీకి పాల్పడితే భారీగానే సొత్తు దోచేసే తంగముత్తు సమాచారం తెలుసుకున్న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీసులకు రేణిగుంట రైల్వే స్టేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. రెండ్రోజుల క్రితం తంగముత్తును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 33 గ్రాముల బంగారు నగలు, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. తంగముత్తును రిమాండుకు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.