TTD News : తిరుమల నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లు డౌన్ అయ్యాయి. గంట నుంచి టీటీడీ సర్వర్లు మొరాయించాయి. సర్వర్లు మొరాయించడంతో భక్తులకు సేవలు నిలిచిపోయాయి. గదులు పొందేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 నుండి 8.10 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. శ్రీ ఆనందకుమార దీక్షితులు కంకణబట్టార్‌గా వ్యవహరించారు. కాగా, రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఎస్ఇ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ జి.రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Also Read :
JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..
AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు