Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

|

May 02, 2022 | 5:26 PM

Railway News: కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గడంతో మునపటి రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే పునరుద్ధరించింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
Railway News
Follow us on

Railway News: కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గడంతో మునపటి రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే పునరుద్ధరించింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్ల(Summer Special Trains)ను నడుపుతోంది. మరీ ముఖ్యంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి(Tirupati)కి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.  ఇందులో భాగంగా హైదరాబాద్ – తిరుపతి,  తిరుపతి – కాకినాడ టౌన్  మధ్య నాలుగు స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ -తిరుపతి – హైదరాబాద్ ప్రత్యేక రైలు..

ప్రత్యేక రైలు (నెం.07433) మే మూడో తేదీన (మంగళవారం) సాయంత్రం 06.40 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.50 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.07434) మే 5 తేదీన రాత్రి 08.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

తిరుపతి – కాకినాడ టౌన్- తిరుపతి ప్రత్యేక రైలు

అలాగే ప్రత్యేక రైలు (నెం.07435) మే 4 తేదీన సాయంత్రం 04.15 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 4 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. మరో ప్రత్యే రైలు (నెం.07436) మే 5 తేదీన ఉదయం07.30 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 06.40 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమయ్యింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి..

Also Read..

Viral Video: ఈ వీడియో చూస్తే చాలా చిన్ననాటి మధురజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.. నెట్టింట వైరల్

Janasena: శుభలేఖలందు ఈ శుభలేఖ వేరయా.. పవన్ కల్యాణ్ పై ఎనలేని అభిమానం.. నెట్టింట ఫొటో వైరల్