ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గణనాథుడి మండపాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొత్త దనాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా ప్రయత్నిస్తున్న యువత యాదవ కాలనీలో డిఫరెంట్ గా వినాయకుడిని ప్రతిష్టించారు. 1800 కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు. యాదవ వీధి, సున్నపు వీధికి చెందిన యూత్ ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక చవితి సంబరాలు జరుపు కుంటుండగా ఈ ఏడాది కూడా కొత్తదనాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగానే 6 నెలల ప్లానింగ్ తో రాగి కలశాలతో వినాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్యూర్ కాపర్ తో తయారు చేసిన 1800 అష్టలక్ష్మి కలశాలను 11 రోజులపాటు కష్టపడి నలుగురు ఆర్టిస్టులు మరో 10 మంది హెల్పర్స్ సాయంతో గణనాధుని విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి కలశం పై అష్టలక్ష్మి ప్రతిమ ఉండగా 150 గ్రాముల వెండి జంజం బొజ్జ గణపయ్య కు ధరింప చేసిన నిర్వాహకులు ఆకట్టుకునేలా కలశం గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి రోజు ప్రతిష్టించిన విగ్రహాన్ని 9 వరోజు ఆదివారం నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు.
వినాయక విగ్రహానికి ఉపయోగించిన అష్టలక్ష్మి కలశాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్టుగా వెల్లడించారు.. కలశం సెటప్ లోనే హుండీ ని కూడా ఏర్పాటు చేసారు. భక్తులను ఆకట్టుకునేలా కలశాల తోనే గోవర్ధన గిరి సెట్టింగ్ విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు భక్తులను ఆకట్టుకునేలా యువకులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..