Liquor Bottles Alipiri: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సిగరెట్స్, మద్యం తాగడం అమ్మడం నిషేధం. అయినప్పటికీ కొంతమంది నిషేధాన్ని పట్టించుకోకుండా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కాని పనులు చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరి వద్ద తనిఖీల్లో భారీగా మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. బెంగళూరుకి చెందిన వెంకటేశ్.. తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్ తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్ గా పని చేస్తున్నాడు. విజిలెన్స్ అధికారులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని.. ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అప్పగించారు.
బెంగళూరుకి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తిరుమలలోసివిల్ వర్కర్ గా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తూ కొండపైకి తనతో మద్యం బాటిల్స్ ను తీసుకుని వెళ్తుండగా.. అలిపిరి కేంద్రం వద్ద తనిఖీల్లో బాటిల్స్ ను అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. గత వారం రోజుల్లో తిరుమల కొండపైకి మద్యం తరలిస్తుండగా పట్టుబడటం ఇది రెండోసారి కావడం గమనార్హం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..