Leopard : తిరుమలలో కలకలం పుట్టిస్తోన్న చిరుతపులులు.. నేడు మళ్లీ ఘాట్ రోడ్‌లో పులి ప్రత్యక్షం

|

Jul 11, 2021 | 7:31 PM

తిరుమలలో ఇవాళ కూడా చిరుత కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏనుగుల అర్చ్ దగ్గర ఈ మధ్యాహ్నం చిరుతపులి ప్రత్యక్షమైంది. బస్సులో ప్రయాణిస్తోన్న వాళ్లు, అటుగా వెళ్తోన్న వాహన దారులు చిరుత కనిపించడంతో..

Leopard : తిరుమలలో కలకలం పుట్టిస్తోన్న చిరుతపులులు.. నేడు మళ్లీ ఘాట్ రోడ్‌లో పులి ప్రత్యక్షం
Cheetha In Tirumala
Follow us on

Leopards spotted : తిరుమలలో ఇవాళ కూడా చిరుత కలకలం రేగింది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏనుగుల అర్చ్ దగ్గర ఈ మధ్యాహ్నం చిరుతపులి ప్రత్యక్షమైంది. బస్సులో ప్రయాణిస్తోన్న వాళ్లు, అటుగా వెళ్తోన్న వాహన దారులు చిరుత కనిపించడంతో సెల్ ఫోన్ లో చిత్రీకరణ మొదలు పెట్టారు. మరోవైపు, నిత్యం తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు కనిపిస్తుండటంతో స్థానికులు, భక్తులు భయాందోళన చెందుతున్నారు. కాగా తిరుమలలో గురువారం ఒక్కరోజు రెండు సార్లు చిరుతలు ప్రత్యక్షమై భక్తుల్ని భయాందోళనలకు గురిచేసిన సంగతి తెలిసిందే. రెండో ఘాట్‌లో రోడ్డు దాటుతూ చిరుత కనిపించగా, అటుగా వెళ్తున్న వారు చిరుతను సెల్‌ఫోన్‌లో బంధించారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డులో చిరుత సంచారంతో.. భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

ఇక గురువారం రాత్రివేళ సన్నిధానం దగ్గర రెండోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సిబ్బంది, భక్తులు పరుగులు తీశారు. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌ దగ్గర కొద్దిరోజులుగా చిరుత సంచారం చేస్తుండడం కలకలం రేపుతోంది. కాగా, తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతున్న సమయంలో ఇలా మృగాల సంచారం కూడా పెరగడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారం పెరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో.. క్రూరమృగాలు తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరుతల కోసం ట్రాప్‌ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలకు నిత్యం లక్షలాదిమంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకునే నేపథ్యంలో చిరుతల సంచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Read also: CM Stalin: పొలిటికల్ స్పైస్ మిస్సైంది..! హుందాతనమైన రాజకీయ పరిమళాల ఆస్వాదనలో తమిళ తంబీలు.?