తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి భారీ విరాళం అందించారు ఓ భక్తురాలు. దాదాపు రూ. 9.20 కోట్ల విలువైన నగదు, ఆస్తిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. చెన్నైలోని మైలాపూర్కు చెందిన రేవతి విశ్వనాథం అనే మహిళ.. ఆమె సొదరి డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం సోదరి ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చింది. ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షల రూపాయల నగదు కాగా.. రూ. 6 కోట్లు రూపాయల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. ఈ మొత్తం విరాళాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం అందచేశారు. భక్తురాలు ఇచ్చిన విరాళంలో రూ. 3 కోట్ల 20 లక్షల నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి వినియోగించనున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. చిన్నపిల్లల సూూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టికెట్లను బుధవారం ఉదయం ఆన్లైన్లోఅందుబాటులో ఉంచింది. బుధవారం ఉదయం స్వామివారి ఉదయాస్తమాన సేవ టికెట్స్ బుకింగ్ డోనేషన్ విండోను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. అలాగే టీటీడీకి విరాళాలు అందించాలనుకున్న భక్తులు వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.
Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..
Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…