Tirumala: టీటీడీ నిర్ణయానికి నో చెప్పిన సర్కార్.. బీజేపీ హర్షం
టీటీడీ బడ్జెట్ లో ఒక శాతం విధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలంటూ ఈ నెల 9 న టీటీఈ పాలకమండలి తీసుకున్న నిర్ణయం రాజకీయ రచ్చగా మారింది. ఈ నిర్ణయం శ్రీవారి నిధులను ఓట్లకోసం దారి మళ్లించేందుకే అంటూ బీజేపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేయగా విశ్వహిందూ పరిషత్ పోరాటానికి సిద్ధమైంది.

శ్రీవారి హుండీ ఆదాయం నుంచి తిరుపతి అభివృద్ధికి ఒక శాతం నిధుల కేటాయింపుకు ప్రభుత్వం బ్రేకులేయడం చర్చగా మారింది. తిరుపతి అభివృద్ధిలో టీటీడీది కీలక బాధ్యతగా భావించిన పాలకమండలి ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై భిన్నమైన వాదనలు తెరమీదకి రావడంతో ప్రభుత్వం నాట్ అగ్రీడ్ అనేసింది. టీటీడీ నిర్ణయం తీసుకున్న వెంటనే శ్రీవారి సొమ్మును హారతి కర్పూరంలా ఖర్చు చేస్తున్నారంటూ హిందూ పరిషత్ తో పాటు బీజేపీ ఆందోళనకు దిగాయి. ఏకంగా హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశాయి. అయితే తిరుపతి పౌర సమాజంతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతించాయి. చర్చలు నడుస్తుండగానే.. తిరుపతి అభివృద్ధికి టీటీడీ ఒక్క శాతం నిధులు ఖర్చు చేయడం కుదరదని.. తాజాగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది.
టీటీడీ బడ్జెట్ లో ఒక శాతం విధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలంటూ ఈ నెల 9 న టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం రాజకీయ రచ్చగా మారింది. ఈ నిర్ణయం శ్రీవారి నిధులను ఓట్లకోసం దారి మళ్లించేందుకే అంటూ బీజేపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేయగా విశ్వహిందూ పరిషత్ పోరాటానికి సిద్ధమైంది. టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయం పై రాజకీయంగా చర్చ నడుస్తుడగా తిరుపతి అభివృద్ధి కోసం టిటిడి నిధులను ఖర్చు చేయడం సరైనదేనన్న వాదన కొందరి నుంచి వినిపించింది. అయితే బీజేపీ మాత్రం పోరాటంలో వెనక్కి తగ్గలేదు. ధర్మ ప్రచారం కోసం కాకుండా..ఇతర పనుల కోసం స్వామివారి నిధులను ఖర్చు చేయడం సరికాదన్న వాదనతో రోడ్డెక్కి ఆందోళనకు దిగింది.
ఈ క్రమంలో ఒక శాతం నిధులు కేటాయింపును అంగీకరించడం లేదని ప్రభుత్వం మెమో జారీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ పాలక మండలి సభ్యుడుగా కొనసాగుతున్న కరికాల వలవన్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రెవెన్యూ ఎండోమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి టీటీడీ ఈఓకు ఆదేశాలు జారీ కాగా ఇది భక్తుల విజయంగా బీజేపీ వర్ణిస్తోంది. పనిలో పనిగా ఇది తమ విజయంగా క్లైయిమ్ చేసుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
