తిరుమల శ్రీవారి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. తిరుపతికి వెళ్లిన వారు ఎక్కువగా లడ్డూ కొనితీసుకెళ్తుంటారు. అందువల్లనే ప్రతీ రోజూ కొన్ని లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా కలియుగ వైకుంఠం తిరుమలలో లడ్డూ వితరణ కేంద్రంలో దొంగతనం జరిగింది. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తుండగా దాదాపు 2 లక్షల 47 వేల రూపాయల నగదును దొంగిలించబడింది. 36వ నెంబర్ కౌంటర్ వద్ద అర్థరాత్రి సమయంలో ఈ చోరీ జరిగింది. దీనిపై 1టౌన్ పీఎస్‌లో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పాత నేరస్తునిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తిరుమలలో డ్రోన్ కెమేరాల షాట్ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో భద్రత కొరవడిందని భక్తుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంలో ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భద్రతపై ఎక్కడా రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందన్నారు. డ్రోన్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో తిరుమల కొండపై డ్రోన్ నియంత్రణ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామని వివరణ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.