
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు వినియోగించే వస్తువుల నాణ్యతపై రాజీకి ఛాన్స్ లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. స్వచ్ఛతకు అత్యాధునిక కవచం అవసరమని భావించింది. ఇందులో భాగంగా తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నెయ్యి తోపాటు ఇతర దినుసుల్లో కల్తీని అత్యంత సూక్ష్మమైన PPT స్థాయిలో కూడా పసిగట్టగలిగే సామర్థ్యం ల్యాబ్ సొంతం.
– టీటీడీ వాటర్, ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రత్యేకతలు ఇవే.
•తిరుమలకు వచ్చే కోట్లాది భక్తులకు సురక్షితమైన నీరు, నాణ్యమైన ఆహారం అందించడంలో టీటీడీ కీలక పాత్ర పోషిస్తోంది.
•ఈ దిశగా, టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను 1981లో నీటి నాణ్యత పరీక్షల కోసం స్థాపించింది.
•ఆ తరువాత 1988లో దీనిని విస్తరించి, ఆహార పదార్థాల నాణ్యతను కూడా శాస్త్రీయంగా పరీక్షించేలా అభివృద్ధి చేసింది.
•ఈ ల్యాబ్ ద్వారా ముడి పదార్థాలు, శ్రీవారి లడ్డూలు, అన్న ప్రసాదం వంటి ప్రసాదాల నాణ్యతను నిరంతరం పరీక్షిస్తున్నారు.
•2018 నుంచి ఈ ల్యాబ్ NABL ప్రమాణాలతో 105 పారామీటర్లపై అక్రెడిటేషన్ పొందడం గొప్ప విషయం.
•ప్రతి నెల సుమారు 1,000 నుండి 1,500 శాంపుల్స్ ను విశ్లేషిస్తూ భక్తుల ఆరోగ్య భద్రతను కాపాడుతోంది.
•అంతేకాకుండా, అన్నప్రసాద కేంద్రాల్లో వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రతను ఎప్పటికప్పుడు నిర్ధారిస్తోంది.
•2024 నవంబరులో NDDB సంస్థ ఆధునిక GC/HPLC యంత్రాలను విరాళంగా అందించడం ద్వారా ల్యాబ్ సామర్థ్యం మరింత పెరిగింది.
•2025 జూలై నుండి నెయ్యి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. కల్తీ నివారణకు ఇది ముఖ్యమైన అడుగు.
కొత్త స్టేట్ ఫుడ్ ల్యాబ్.
•భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రూ.25 కోట్ల వ్యయంతో కొత్త స్టేట్ ఫుడ్ ల్యాబ్ నిర్మాణం చేపట్టడం జరిగింది.
•ఈ ల్యాబ్ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, కెమికల్ మరియు మైక్రోబయాలజీ విభాగాలుగా నిర్మించడం జరిగింది.
•ఇది భారత దేశంలో ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొదటి అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ కావడం విశేషం.
•ఇందులో బ్యాక్టీరియా గుర్తింపుకు ప్రత్యేక క్లీన్ రూమ్ మరియు ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
•కెమికల్ విభాగంలో వివిధ రకాలైన పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్ అవశేషాలు మరియు లెడ్, ఆర్సినిక్ మొదలైన హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
•టీటీడీ తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీకి ఒక ఆదర్శంగా నిలుస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..